నా మనసు రంగుల కళలు

 నా మనసు రంగుల కళలు

రచయిత :: యస్. ప్రవీణ్

వేల రంగులున్న కలల ప్రపంచం
ఏదారి చేరునో బ్రతుకు ఎవరి సొంతం
నీలి కనులలోని ఎదురు చూపు ఎవరికోసం
ఎరుపు పెదవి పలుకు ఎవరి నామం…!!

నలుపు కురుల హొయలు పెంచేనీ సోయగం
మంచికొరకె మన బ్రతుకు పయనం
అరుణ రవి బింబమై ఎదను తాకు స్వప్నాలు
ఏటి అలల వలె చెదురు పగటి కళలు…!!

పసుపు పాదాల క్రింద నలుగు పూలు
చూసి మనసు అడిగే దానికెంత అదృష్టం
సిగలో పురిమిన విరజాజులు చూసి
దేవతై నిలిచే నా ఎదుట తలుపుపోసి…!!

గులాబీ గుబాలింపులు సోకిన నామనసుకి
పచ్చని నీ పైటలో చిక్కిన నా మనసుకి
బంగారమేని చూసి అసూయపుట్టే
నాదేవతై నీవు ఎదుట నిలిచినపుడు…!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!