జనజాగృతమవుదాం – జననిని కాపాడుకుందాం

జనజాగృతమవుదాం – జననిని కాపాడుకుందాం

రచయిత: వడ్డాది రవికాంత్ శర్మ

 

అనర్గళంగా ప్రసంగిస్తున్న ఆమె గొంతు …/
అసంకల్పితంగా మూగబోయింది …/
ఆమె ఎదురుగ జరిగిన సంఘటన …/
అమ్మతనాన్నే కాక ఆమెలోని కూతురు కోణాన్ని తట్టిలేపింది …/

భూమిని దున్నే బక్కచిక్కిన రైతు …/
పంటచేతికి రాక ప్రాణాలు వదిలాడు …/
తెల్లటి పంచెకట్టిన తండ్రిలాంటి రైతు చలనంలేని శరీరాన్ని చూసి ../
కాబోయే ప్రజాప్రతినిధిగా కాక కన్నా కూతురిలా వెక్కి వెక్కి ఏడ్చింది …/

విత్తు నాటే వేళ , అది మొలకెత్తే వేళ రాని వర్షం …./
పంటచేతికి వచ్చేనాడు ప్రళయ ధ్వని చేస్తూ కురిసింది …/
కృత్రిమ కలుపు మందులు సగం దిగుబడిని మింగేయగ…/
నిస్సారమైన భూమాత, పుత్రునికడుపు నింప తాపత్రయపడగ…/

అకాలముగ , ఆఘమేఘాలపై …/
జోరుగ కురిసిన తుఫాను తల్లీకొడుకులను ముంచెత్తేను …/
వారి అనుబంధముపై ఆధారపడ్డ సమస్తమానవాళి …./
పొట్టచేతబట్టి రోధించెను తల్లీ! .. మరి విపత్తులు రావద్దని …/

ప్రణాళికలు రచించేటి నవ రాజకీయ నాయిక …./
మాతృహృదయం గాయపడెను, రైతన్నను విగత జీవిగ చూసి …/
నేర్చుకొనెను ఎన్నో పాఠాలు …./
సంకల్పించేను ప్రకృతి అనుకూల జీవనాన్ని …./

ఆగ్రహంతో ఆవిర్లు కక్కుతూ , సముద్రగర్భాన అగ్నిపర్వతాలు …/
ఎన్నెన్నో ఒత్తిడులు , ఉష్ణోగ్రతలు కావా అవి సైక్లోనుల జన్మస్థానాలు …/
భద్రతలేని మత్స్యకార జీవన విధానాలు , కానరాని వారి జీవితభీమాలు…/
అనుకోని కోస్తాతీర వైపరీత్యాలు , లక్షలాది అమాయక నిర్వాసితులు …/

హద్దులులేని నగరజీవి ఆర్థిక అవసరాలు …/
అన్యాక్రాంతమవుతున్న రక్షిత వనాలు ,ఆచూకీ కోల్పోయిన మన సరస్సులు ../
కోపించిన భూమాత దేహంపై కంపనాలు …./
వందేళ్ల ముందుకి , వెయ్యేళ్ళ వెనక్కి తీసుకెళ్తున్న సాంకేతిక ఫలాలు …/

అవగాహనే కదా ప్రకృతి పరిరక్షణకు అసలు మార్గం …/
జపాను మార్గంలో జాగృతమవుదాం , ప్రకృతి విపత్తు నిర్వహణలో జన ఉద్యమం ప్రకటిద్దాం …/

You May Also Like

One thought on “జనజాగృతమవుదాం – జననిని కాపాడుకుందాం

  1. అద్బుతం మీ రచన
    అద్వితీయమైన మీ ప్రతిభ కీ నా మనస్సుమాంజలులు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!