నేటి యువత
రచయిత:శ్రీదేవి శ్రీనివాస్ (శ్రీ ❤️ శ్రీ)
రాయడానికి ఏముంది వారిమీద కవిత
సగానికి పైగానే దేనికీ పనికి రాని చెత్త
వారికి చుట్టూ ఉన్న స్నేహితులంతా
చూస్తే నాకు అనిపిస్తుంది గంతకు తగ్గ బొంత
ఆన్ లైన్ లో ఆడేరు గేములు పగలంతా
వాట్సప్ లో చాటింగులే ఇక రాత్రంతా
ఫేస్ బుక్ లో ఫ్రెండ్ రిక్వెస్ట్ లే మిగిలిన టైమంతా
టైము కెన్నడు కడుపులో వేయరు ముద్ద కూసింత
పెద్ద వాళ్ళు ఏమి చెప్పినా దృష్టి పెట్టరు రవ్వంత
టిక్ టాక్ లు, టకా టక్ లు అంటూ వీడియోలే చేస్తున్నారంతా
లిప్ స్టిక్ లకు, మేకప్ కిట్ లకే సరిపోతుంది నాన్న సంపాదనంతా
ఇరుగుపొరుగు ఉన్నారో లేదో పట్టించుకోరు కూసింత
లైకులు కామెంట్లు లకే ఎల్లప్పుడూ ధ్యాసంతా
ఆన్ లైన్ క్లాసులంటూ అమ్మ మీద పడేస్తారు పని అంతా
భవిష్యత్తు గురించి ఆలోచనైనా లేదు పిసరంత
తల్లిదండ్రుల కదే నిరంతరం బాధించే చింత.