అనుబంధాల హరివిల్లు

అనుబంధాల హరివిల్లు

రచయిత :: v. కృష్ణవేణి

ఉమ్మకుటుంబం ఒకదేవాలయం అనుభవిస్తేనే తెలుస్తుంది దానిలో అనుభూతి
ఆచారావ్యవహారాలు, పద్ధతులు, పిల్లల అలనాపాలన, సంస్కృతి సంప్రదాయాలు తెలియచేస్తూ …
ఆహారఅలవాట్లు, ఆరోగ్యానియమాలు పూర్వికులు చూపించిన ఆచారాలు అన్నికూడా కళ్ళకు కట్టినట్లు చూపించే వ్యవస్తాగా…
ఒకరికొకరు కష్టసుఖాలలో పాలు పంచుకుంటూ అనురాగ ఆప్యాయతలతో సమిష్టిగా మెలుగుతూ…
కుటుంబవ్యవహారాలు ఎలాచక్కదిద్దుకోవాలో తెలియచేస్తూ కష్టానష్టాలను ఎలా ఎదుర్కోవాలో చేతలలో చూపిస్తూ సమాజం పట్ల ఎలామెలగాలో తెలియచేస్తూ..
పిల్లలపై  పెద్దలకు గల బాధ్యతను…
పిల్లలకు పెద్దలపై గౌరవమర్యాదలను తెలియచేస్తూ
సమాజంలో గౌరవ మర్యాదలను అందించే అభ్యాసనాలయంగా.,
పూర్వికులు అందించిన ఆరోగ్య సంపద,
పండగలు, ఉత్సవాలు జరుపడానికి గల కారణాలను,దానిలో దాగిఉన్నానిజాలను
కళ్ళకు కట్టినట్లు చూపిస్తూ…
మొక్కలలో ఔషదలను గుర్తించి సంప్రదాయం గా పూజిస్తూ ఆరోగ్యానియమాలను తరతరాలకు అందిస్తూ…
ప్రేమానురాగాలను చూపిస్తూ
ఒకరికొకరి వరసలతో పిలుచుకునే పిలుపులు
దినచర్య కార్యక్రమాలలో అనుభూతులు రోజు పండగవాతావరణాన్ని చూపిస్తూ ప్రేమానురాగాలతో వస్తుపోతున్నా బంధువుల
అడావుడితో, పెద్దల ఉమ్మడి ఆలోచనలతో భవిష్యత్తు తరాలకు పునాదివేస్తూ కలతలు లేకుండా మమతాను రాగాలతో ప్రేమనుబందాలతో సాగిపోతుంది ఉమ్మడి కుటుంబజీవితం….
అదే తరతరాలకు తరిగిపోని ఆస్తి..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!