ఇలా బ్రతికేయాలని వుంది

ఇలా బ్రతికేయాలని వుంది
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: దోసపాటి వేంకటరామచంద్రరావు

అకాశాన్నుదుకోవాలనే ఆశలేదు
అందలాలు ఎక్కాలనే కోరికలేదు
ఆశయాలను సాధించాలనే తపనలేదు
ఆదర్శాలను వల్లించాలని యావలేదు
అందరిని  కలుపుకోవాలనిలేదు
ఎదో అలా సామాన్యంగా జీవించేయాలనివుంది
ఎవరిని ఇష్టపడకుండా
ఎవరిని ఇబ్బందిపెట్టకుండా
ఎవరిని నిందింఛకుండా
ఎవరిని నిలదీయకుండా
అలా ఎదోలా బ్రతికేయాలని వుంది
ఒంటరిగానే వచ్చాను
ఒంటరిగానే పోతాను
ఈమధ్యనజరిగేకాలమంతా
అలా ఎదోలాబ్రతికేయాలని వుంది
బ్రతికేద్దాం ఎవరికి ఏబాధావుండదుకదా!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!