దొంగ తెలివి

దొంగ తెలివి
                                     (తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)             

రచన :వేల్పూరి లక్ష్మీ నాగేశ్వరరావు

        ఆకు పచ్చని చేలు లో నడుములొంగిపోతు, రైతన్నలు వరి విత్తనాలు నాటుతున్నారు. గోచి ఎగ్గొట్టి, భగ భగ మండే ‘సూర్యుని ‘వేడికి చెమటలు కక్కుతూ, తమ తమ పనులలో నిమగ్నమయ్యారు.’ ఒరేయ్య్ కనకారావు, నీ కొడుకు ఏంట్రా! చదువు, గిదువు లేకుండా ఊర్లో బలాదూర్ తిరుగుతున్నాడు, వాడ్ని కొంచెం దారి లో పెట్టరా! అన్న సాటి రైతు మాటలకు బాధపడుతూ ఏం చేస్తామ్ రా,! నాకు ఉన్న ఈ కాస్త పొలం పనులు అయినా సాయం చేస్తాడా, అంటే ,లేదు నాన్న నాకు పనుంది, అంటూ బట్టలు వేసుకుని స్నేహితులతో సైకిల్ మీద తిరుగుతూ, అన్ని చోట్ల గొడవలు పెట్టుకుంటూ వీధి రౌడీలా తయారయ్యాడు, వాళ్ళమ్మ పోయినా దగ్గర్నుండి చదువు మానేసి, చిల్లర తిరుగుళ్ళు తిరుగుతూ,’ ఈత కల్లు ‘తాగుతూ నానా గొడవలు చేస్తున్నాడు, ఆ దేవుడే రక్షించాలి !అంటూ మాసిపోయిన తలపాగా తీసి కళ్ళు తుడుచుకొంటూ, పదరా ఎండ మండిపోతోంది! కొంచెం గంజి అన్నం తిని చెట్టు నీడ జార పడదాం! అంటూ ఆ ఇద్దరూ కబుర్లు చెప్పుకుంటూ, అలిసిపోయిన శరీరాలతో తనతో తెచ్చుకున్న సిల్వర్ డబ్బా తెరిచి, గంజి అన్నం కలుపుకొని ,ఒక ఉల్లిపాయ ముక్క, మరో ఊరగాయ ముక్క నంచుకుంటూ తృప్తిగా తిని, అదే చెట్టు నీడలో మళ్లీ తలపాగా తీసి  కిందన పరచుకొని పడుకున్నారు.
కనకారావు కి ఒకే ఒక్క కొడుకు ‘చంద్రం ‘వాళ్ళ అమ్మ  ఎంతో గారాబంగా పెంచటం వలన, స్కూలుకు వెళ్లి చదువుకున్నట్లు నటిస్తూ, అల్లరి మూకలతో కూడి చిల్లర దొంగతనాలు చేయడం, అలవాటైపోయింది. అలాగే పెద్దవాడై చదువు ఒంటబట్టక, కూలీ పని చేయలేక, శుభ్రంగా తిని బలాదూర్ తిరుగుతూ, అడపాదడపా చుట్టుపక్కల గ్రామాల్లో కోళ్లు ,మేకలు, ఆవులు దొంగ లిస్తు, వాటిని వేరే ఊళ్ళ లో అమ్మి తన సరదాలు తీర్చుకునే వాడు. పాపం కనకారావు భార్య ‘మంగమ్మ ‘భర్తతో కలిసి తమకు ఉన్న చిన్న పొలంలో దుక్కి, దున్ని , ఎరువులు వేసి, విత్తులు నాటడం, భార్య భర్తలు తమ వయసు కూడా మర్చిపోయి కష్టపడుతూ సంసారం సాగించేవారు. ఒకరోజు మంగమ్మ ఒక్కర్తే పనిచేసుకుంటూ, సాయంత్రం ఇంటికి వస్తున్నప్పుడు, ఒక ‘రాచనాగు ‘బుసలు కొడుతూ వచ్చి కాటేసింది, అంతే  ఊర్లోఉన్న మిగతా రైతులంతా కలిసి,  ఆగమేఘాలమీద ఆమెను ఆసుపత్రికి తీసుకు వెళ్ళిన, విషం శరీరమంతా పాకి మంగమ్మ ప్రాణాలు తీసే సింది. ఇక కనకారావు ఒంటరి జీవితం ఎంతో దుర్భర మై పోయింది, తల్లి పోయిన  కొడుకు చంద్రం ప్రవర్తన మారక పోవడం వలన ఆ తండ్రి  మూగవేదన కు అంతులేకుండా పోయింది. ఆరోజు ‘ఒరేయ్ చంద్రం, పొలం పని ఉందిరా! ఒక్కడిని చేయలేక చస్తున్నా, కూసంత సాయం చేయమని ఎంత అడిగినా, కనికరంలేని కొడుకు ‘ఓరయ్య! నువ్వు చేస్తే చెయ్యి లేదా అమ్మి పారే యి, కాళ్ళు జాపుకొని ఇంట్లో తొంగో! నేను ఏదో లాగా నీకు గంజి పోస్తా! అని చిరాకుగా వెళ్ళిపోయాడు. ఆ తర్వాత ఎన్నో దొంగతనాలు చాలా తెలివితేటలతో చేస్తూ, ఏ ఒక్కరికి అనుమానం రాకుండా జాగ్రత్త పడుతూ, తన స్నేహితులకు ఒక ‘బాస్ ‘గా వ్యవహరిస్తూ ఉండేవాడు చంద్రం. అలా ఎంతో తెలివితేటలు ప్రదర్శిస్తూ, రెండు ఊళ్ళ అవతల ఉన్న ‘పాండ్రంగి ‘ గ్రామ మునసబు ఇంట్లో చాలా డబ్బు, బంగారం ఉన్నాయని తెలిసి, ఒరేయ్ ! ఈరోజు పాండ్రంగి మునసబు గారి ఇంట్లో దొంగతనం చేస్తున్నాం, ఒకవేళ పట్టుబడితే, ఎవరి పేరు ఎవరు చెప్పకూడదు, అందరూ ముసుగులు, కత్తులు ఉంచుకోండి! నేను రాత్రి 8 గంటలకు వస్తాను, రెడీగా ఉండండి, ఇది గాని చేస్తే ఈ సంవత్సరమంతా మనం జల్సా చేయొచ్చు! అని చెప్పి ఇంటికి వచ్చి నాన్న వండిన అన్నం తింటూ, ఏంటి నాన్న? కోడిగుడ్డు కూర లేదా, తినలేక చస్తున్నాను, ఎప్పుడు గంజి నీళ్లు ఆవకాయముక్కనా, మీ ముసలి వాళ్లకు ఇది చాలు, మాకు మాత్రం అన్ని రుచులు కావాలి, ఛీ , ఎదవ బతుకు! ఉండు నేను బాగా సంపాదించి, నీకు చూపిస్తాను, అప్పుడు తెలుస్తుంది రుచి అంటే ఏమిటో? అంటూ తినేసి బయలుదేరి పోతున్న కొడుకును ‘ఏరా తిని తొంగోక, ఇంత రేతిరి పూట నీకు పని ఏంటి? అని అనే అడిగేసరికి ,అయ్యా! నేను పక్క ఊరిలో మా స్నేహితుడు పెళ్లి కి వెళ్తున్నా, రెండు రోజులు రాను అంటూ చటుక్కున తలుపు వేసి సైకిల్ మీద వెళ్ళిపోయాడు చంద్రం. ఆ రాత్రి అనుకున్న ప్రకారం ఇద్దరు స్నేహితులతో కలిసి, రాత్రి  12 గంటల సమయంలో లో, మునసబుగారి పెరట్లో నుంచి వచ్చి, ఇంటి పైన పెంకులు ను తొలగించి, తిన్నగా ‘ఇనపెట్టి ‘ఉన్నగదిలోకి వచ్చి, అది చప్పుడు కాకుండా బద్దలు కొట్టి, దొరికినంత బంగారం, డబ్బు తీసుకొని పారిపోతున్న సమయంలో, చప్పుడుకు లేచిన మునసబు ఆయన కొడుకు, నౌకర్ల తో కలిపి , తన తుపాకీ తీసుకుని వెంటపడ్డారు, చంద్రం  అతని అనుచరులు, ఆ చీకట్లో పొలాల వైపు పరిగెడుతూ, మునసబుగారి తుపాకీ శబ్దానికి భయపడి, డబ్బు, బంగారు ఉన్న మూటలను అక్కడే వదిలేసి,  పరిగెడుతున్న సమయంలో  అడ్డదారి నా వచ్చి దొంగలను పట్టుకున్నారు, ఆ ఊరి ప్రజానీకం.
‘మునసబుగారు ‘ ఆ ముగ్గురిని చెట్టుకు కట్టేసి,  ఊర్లో ఉన్న ఒకే ఒక్క ‘ల్యాండ్ లైన్ ‘ ఫోన్ లో, పోలీసులకు కబురు చేశారు. పోలీసులు వచ్చేసరికి  మునసబుగారు సార్ సార్ ! ఈ ముగ్గురు దొంగలు నా ఇనుపపెట్టి దోచి, చాలా డబ్బు, బంగారం తీసుకొని పారిపోతుండగా పట్టుకున్నాము, కొంచెం దొరికింది, మరికొంచెం దొరకలేదు! అంటూ ఉన్నది లేనిది, కలిపి చెబుతూ ఈ ముగ్గురు మా ఊళ్లో చాలాసార్లు ఆవులు, మేకలు, కోళ్ళు దొంగలించి, మాకు ఎంతో నష్టం కలిగించారు, ఈ దొంగ వెధవలను వదలకండి! నేను వీళ్ళకి ‘ఐదేళ్లు జైలు శిక్ష ‘ పడేటట్లు కేసు పెడతాను! అని అనగానే ,ఊరి పెద్ద అయినా మునసబుగారి కంప్లైంట్ మీద ‘FIR ‘రాసి సంకెళ్ళు వేసి, జైల్లో పెట్టి ఎన్నో విధాలుగా కొట్టిన, చంద్రం ఒకే మాట చెబుతూ, సార్, మేము దొంగలించిన ది నిజమే ! కానీ అన్నీ అక్కడే వదిలేశాం, అని చెప్పిన వినని పోలీసులు విపరీతంగా కొట్టి జైలులోని ఎవ్వరి తో కలవ నీయకుండా ఉంచారు. ఈ విషయం ఆనోటా, ఈనోటా తండ్రి కనకారావు కు తెలిసి, ఓరి వెధవా! హాయిగా పొలం పని చేసుకోక, దొంగతనాలు చేస్తావా? ఛీ, మీ అమ్మ  బ్రతికి ఉంటే ఈరోజు గుండె ఆగి చచ్చి ఉండేది, నువ్వు కూడా చావరా! అంటూ గుండెలు బాదుకుంటూ కూల బడిపోయాడు కనకారావు. ఆ మర్నాడు తండ్రి లబోదిబోమంటూ’ పోలీస్ స్టేషన్ కి వచ్చి కొడుకును కలుద్దాం, అన్న పోలీసులు అతనిని బయటనే ఉంచి, ఒరేయ్ నీ కొడుకు దొంగ వెధవ! వాడికి పెద్ద జైలు శిక్ష పడ్డాక, వచ్చి కలద్దు గాని, అంతగా నీకు ఏమైనా వాడికి చెప్పాలని అంటే, ఒక ఉత్తరం రాసి ఇవ్వు, వాడికి అందజేస్తాము, అని అనగానే అలాగే ఏడుస్తు అక్కడే ఉన్న ఒక చదువు వచ్చిన ఆసామీ తో కాగితం మీద  ఉత్తరం రాయిస్తూ ‘ఒరేయ్ చంద్రం! ఎంత పని చేసావు రా ? తప్పు ఒప్పుకొని మునసబుగారి డబ్బు, బంగారం ఎక్కడ ఉన్నాయో చెప్పు! నేను మునసబు గారి కాళ్లు పట్టుకొనీ బతిమిలాడు కుంటాను, అయినా,  ఒక పక్క మన పొలం దున్నాలి, అసలే చిన్న పొలం రేపు దున్నక పోతే, మన పొలమంతా బీడు అయి పోతుంది, నేను ఒక్కడినే చేయలేను రా! అలాగని కూలీలను పెట్టలేము, ఎలాగైనా  పొలం అంతా దున్నించి, నీరు పెట్టి, విత్తనాలు జల్లాల, నువ్వు ఎలాగైనా సాయం చేయరా! లేకపోతే పొలం ఎండి పోయి, ఈ సంవత్సరమంతా పస్తులు ఉండాలి రా, పొలం పండితే నే మనం అమ్మవచ్చు, నీ కోరిక అదే కదరా! ఏదో ఒకటి చేయరా, ఈ ముసలి వయసులో నేను చేయలేను రా! అంటూ రాయించి, అక్కడే ఉన్న కానిస్టేబుల్ కి ఇచ్చి బాబు గారు! ఇది మా అబ్బాయి చంద్రానికి ఇవ్వండి, ఏమైనా వాడు జవాబు ఇస్తే నాకు ఇవ్వండి! అంత వరకు ఇక్కడే ఉంటాను అంటూ ఏడుస్తూ కూర్చుండిపోయాడు తండ్రి కనకారావు. ఆ ఉత్తరం జైల్లో ఉన్న చదవడం రాని చంద్రం, చదువుకున్న తన మిత్రుని కి ఇచ్చి, బాబు, కొంచెం చదివి పెట్టరా , మా అయ్య వచ్చి ఇచ్చాడంట, ముసలోడు ఏమైపోతాడో ఏమో,? అంటూ తన స్నేహితుడి కి ఇచ్చేడు, ఉత్తరం లో విషయం విన్న వెంటనే ఖాళీగా ఉన్న వెనక వైపు అదే కాగితంలో ఇలా రాయించాడు, అయ్యా,! నేను చేసింది తప్పే, మునసబు నన్ను జైల్లో పెట్టించాడు, ఇప్పట్లో నన్ను విడుదల చేయరు, నేను నీకు ఎలాంటి సహాయం చేయలేను, నేను ఒక రహస్యం చెప్తాను జాగ్రత్తగా విను! మన పొలం లో ‘తూర్పు దిక్కున ‘కొంచెం బంగారం , డబ్బు దాచి పాతి పెట్టాను, అది వెలికి తీసుకుని కూలీలను పెట్టి పొలం దున్నించి, పంట వెయ్యు, ఈ విషయం ఎవరికీ తెలియ కుండా ఈ రాత్రికి రాత్రే చెయ్యి, నేను శిక్ష పడ్డ కొంతకాలం తర్వాత నీ దగ్గరకు వచ్చి, నిన్ను బాగా చూసుకుంటాను, నన్ను క్షమించు! అని అదే ఉత్తరాన్ని పోలీస్ బాబు కు ఇచ్చి అయ్యా! మా అయ్య బాగా ముసలోడు, ఉత్తరాన్ని ఇచ్చేయండి, వీలుంటే మీ దగ్గర అ కొంచెం భోజనం ఉన్నా పెట్టి పంపించండి, లేకపోతే చచ్చిపోతాడు, అయ్యా అంటూ పోలీస్ కు అ ఉత్తరం అందించాడు చంద్రం.
అక్కడే ఉన్న ‘హెడ్ కానిస్టేబుల్ ‘ఉత్తరం లాక్కుని ఇన్స్పెక్టర్ గారి రూమ్ లోకి వెళ్లి, ఆ ఉత్తరం చూపిస్తూ చూడండి! ఆ దొంగ వెధవ, వాళ్ళ నాన్నకి ఉత్తరం రాస్తూ, అందులో ఒక రహస్యం రాశాడు, అదేమిటంటే కనకారావు పొలంలో, తూర్పు దిక్కున కొంచెం డబ్బు ,బంగారం దాచిపెట్టానని, అది  త్రవ్వి తీసుకొని ,పంట పండించ మంటున్నాడు, ఈ దొంగ వెధవ, ఎంత డబ్బు బంగారం అందులో దాచాడో తెలియదు! కనుక ఈ రాత్రికి రాత్రే మనం పది మంది పోలీసులు ను పట్టుకువెళ్లి, మొత్తం పొలమంతా తవ్విo చేద్దాం, అది గానీ దొరికితే ఈ దొంగ వెధవ ని జీవితాంతం జైలు లో మగ్గేటట్టు శిక్ష వేయిద్దాం,! అనగానే , పలుగు , పారలతో ఒక పది మంది పోలీసులు రాత్రికి రాత్రి కనకారావు పొలమంతా ఇష్టం వచ్చినట్టు తవ్వి చూశారు, ఎక్కడా ఏమీ కనబడక నిరాశతో పోలీస్ స్టేషన్కు వచ్చి, అబద్ధం చెప్పినందుకు, ప్రతి ఒక్కరూ  చంద్రాన్ని కుళ్లబొడిచారు. అన్నీ  నవ్వుతూ భరిస్తూ, తనలో తనే “చూశావా అయ్యా! ఏ కూలీలు అవసరం లేకుండానే, రేపు నువ్వు వచ్చి చూసేసరికి నీ పొలమంతా చక్కగా దున్ని ఉంటుంది, నువ్వు నీరు పోసి, విత్తనాలు వేయడమే ఇక నీకు సంవత్సరం వరకు తిండికి కొదవలేదు, ఈ నా ‘చావు తెలివితేటలు’ ఇందుకు ఉపయోగపడ్డాయి, కనుక నేను తిరిగి వచ్చి నీకు పొలంలో సాయం చేస్తాను! ఇకముందు ‘దొంగతనాలు చెయ్యను’ ఇది నేను అమ్మ మీద ‘ప్రమాణం ‘ చేసి చెబుతున్నాను, అనుకుంటూ తృప్తిగా శరీరానికి పడిన దెబ్బల గాయాల్ని నవ్వుతూ భరించాడు చంద్రం.

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!