ప్రపంచము!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
ప్రపంచాన్ని, నువ్వెట్లా చూస్తావో,
ప్రపంచము నిన్ను అలానే చూస్తుంది!
ప్రపంచానికి నువ్వు ఏం పంచిపెడతావో,
అదే పదింతలుగా, నీకు తిరిగివస్తుంది!
ఇప్పటికి, మనం శిభిచక్రవర్తి పేరు,
దానకర్ణుడి పేరు, మదర్ థెరీసా పేరు
చెప్పుకుంటున్నాం, కారణం
వాళ్ళలోని ప్రేమ, జాలీ, దయాగుణం!
ప్రపంచానికి ప్రేమను పంచు, అందుకే
గాంధీగారిని మహాత్ముడన్నారు!
వ్యక్తిత్వం మంచిమనుషులను,
మంచిమనుషులు దేశాన్నీ తీర్చుదిద్దుతారు!
తరచిచూస్తే, ప్రకృతి అంతా కారుణ్యమయమే!
నిత్యచైతన్య దినకరుడు, చల్లనివెన్నెల పంచే శశి,
దాహార్తిని తీర్చే నదీమతల్లులు,
ప్రాణవాయువునిచ్చే గాలి వింజామరలు,
ప్రకృతి అంతా ప్రేమమయమే!
ప్రకృతి నుంచి ప్రేమను పంచటం నేర్చుకుందాం!
ప్రపంచానికి కోపం, ద్వేషం, పగ బదులు, మానవత్వంతో, ప్రేమను పంచుదాం!