“సాలెపురుగు కథ”

“సాలెపురుగు కథ”
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : యాంబాకం.

మనం ఉండే ఈ లోకంలో ప్రస్తుతం ఇల్లు, మేడలు, భవనాలు, చెరువులు, వంతేనలు, ఇవి అన్నీ కూడా ఇప్పుడు మనం నిర్మించు కుంటూ ఉన్నామని మనం అనుకుంటూ ఉన్నాము. అసలు ఈ వృత్తి ఏలా వచ్చిందో మనకు తెలియదు. “మనం ఉండే ఈలోకాన్నీ, అలాగే దేవతలు, రకరకాల ప్రాణులు, ఉండే లోకాలు 14లోకాలు ఉండాయట వాటిని అన్నిటికీ “సృష్టి కర్త బ్రహ్మ దేవుడు” ఈ సృష్టి ని నిర్మించటంలో బ్రహ్మ నేర్పరి, అందుకే బ్రహ్మ దేవుని అందరూ మెచ్చు కున్నారు”. అలాంటి బ్రహ్మ కు ఒక్కడే ఇన్ని పనులు చేయలేక ఒక శిష్యుడను సృష్టించాడు. అతడే విశ్వకర్మ, విశ్వకర్మ దేవతలకు మంచి మంచి మేడలు, మిద్దెలు, సభలూ తోటలు ఉద్యానవనాలూ ఇంకా చిన్న, చిన్న సరస్సులూ ఇలాంటివి సృష్టించగల నేర్పరి. ఐతే విశ్వకర్మకు బ్రహ్మవరంచే ఒక కుమారుడు కలిగాడు. అతడు కూడా సృష్టికి ప్రతిసృష్టి తండ్రినే కాదు, సృష్టించడంలో బ్రహ్మనే మించిపోయాడు. చూసిందల్లా చేసెయ్యగలడు. అంత ప్రజ్ఞ శాలి.
అందరూ బ్రహ్మదేవున్ని మెచ్చుకోడం పరిపాటి కానీ “విశ్వకర్మ కొడుకు మాత్రం “ఆ..! బ్రాహ్మ గొప్పతనం ఎంది? అంతకన్న గొప్ప సృష్టి ని నేను సృష్టిస్తాను” అలాంటి లోకాలు వింతలూ బ్రహ్మదేవుడులాగే సృష్టించగలనూ అని బ్రహ్మకు మల్లె ప్రతిధీ చెయ్యటం మొదలు పెట్టాడు. ‘ఇలా తనలాగ సృష్టి జరుగుతుందని ఎవరో తెలుసుకోవడానికి విశ్వకర్మను పంపి తెలుసుకొని తన లోకానికి తీసుకోని రమ్మని విశ్వకర్మతో చెప్పగా!’ విశ్వకర్మ :బ్రహ్మతో అతగాడు ఎవరో కాదు స్వామి మీ వరంతో నాకు కలిగిన నా పుత్రుడు “ఊర్ణనాభుడు” అని తెలుపుగా! బ్రహ్మ ఆవేశంతో వేంటనే అతన్ని బ్రహ్మ లోకం రప్పించాడు. “ఏమోయ్! నువ్వు గర్వంతో దేవులన్నే ధిక్కరిస్తున్నావే! నీకు నాతో పోటీ నా! నీవు సృష్టించినది, నాసృష్టితో పోలికనా! “ఇకనైనా బుద్ధి గా మసలుకో లేదా! నా కోపాగ్నికి బలికాగలవు అని హితవు పలికాడు బ్రహ్మ దేవుడు.” కానీ విశ్వకర్మ కొడుకు “బ్రహ్మ దేవునికి ఎదురు నిలిచాడు. అంతే ఎంత మంచివారైనా దిక్కరిస్తే ఊరుకుంటారా! అంతే బ్రహ్మ దేవునికి పట్టరాని కోపం వచ్చి, కీటక జన్మ ఎత్తెదవుగా! అంటూ నే..! భూలోకంలో సాలెపురుగు గా జన్మించు అని శపించాడు. “శాపం తగలటంతో నే విశ్వకర్మ కొడుకు గజ, గజ వణుకుతూ..! “బ్రహ్మ దేవుని కాళ్ల మీద పడిదేవా! మన్నించు నన్ను కాపాడు”. ఈ కీటక జన్ననుంచి శాపంతొలగించు” అని అనేక విధాలుగా ప్రాధేయ పడ్డాడు.” ” బ్రహ్మ ఎంత కాదన్న తన సృష్టించిన వాడే కదా యని జాలిపడి నాయనా “ఊర్ణనాభా ” నీవు సాలెపురుగు గా పుట్టక తథ్యం”అయితే నీకు తోడుగా ఒక ఆడ కీటకాని పుట్టిస్తాను. మీరు మీ సంతతిని వృద్ధి చేసి తరువాత మీకు మోక్షం కలుగాక అని బ్రహ్మ తిరిగి మోక్ష మార్గం చూపగా! “ఊర్ణనాభుడు. చేసేదిలేక భూలోకంలో సాలీడుగా పుట్టాడు.” బ్రహ్మ అనుగ్రహం మీద ఒక ఆడసాలీడు కూడ తోడైయింది. ఐతే ఊర్ణనాభుడు భూలోకంలో కీటకంగా జన్మించినప్పటికి వాడికి పూర్వ జన్మ వృత్తాంతం అంతా జ్ఞాపకం ముంది. కొంత కాలం గడిచింది. సాలెపురుగుగా మారిన ఊర్ణనాభుకి కొంత సంతానం కలిగింది. పుట్టిన ప్రతి కీటకం ఎదో కట్టడాలు కట్టడం గూళ్ళు కట్టడం మొదలు పెట్టాయి. ఇలా ఊర్ణనాభుడు తన సంతతి ఇలా గూళ్ళు కట్టడం చూసి తన వృత్తి సృష్టే కదా! అని గుర్తుకు వచ్చి తన మోక్ష మార్గం వెతుకుతూ! అడవిలోకి పారిపోయాడు సాలెపురుగుగా ఆ ఆడవిలో ఒక చెట్టును ఆశ్రయించి జీవించ సాగాడు. “పూర్వ జన్మలో ఎంతో అందమైన సృష్టిలు కట్టిన ఊర్ణనాభుడు ఈ అడవిలో కూడా కట్టడాలు కట్టడం మొదలు పెట్టాడు.” అడవిలో ఆచెట్టు ఈ చెట్టుకు మధ్య ఇల్లులు కట్టడం మొదలు పెట్టింది. ఐతే అది కీటకం కదా ఇటుకలు సిమెంట్ తేలేదు కదా! అందుకే దాని బాడీలోపనే ఒక జిగట జిగురును తయారు చేసుకొనే ఒక గ్రంథిని సృష్టించి, దానిని నూలుపోగులా వచ్చేలా సృష్టించి, దాంతో గూళ్ళు నిర్మించటం చేయసాగింది. “ఇలా అడవిలో కొన్ని సంవత్సరాలుగా గూళ్ళు కట్టుతూనే ఉంది”. ఆ గూళ్ళు ఎన్నో పురుగులు రకరకాల, కీటకాలలు ఇలా కొని విరుక్కొని పొలేనంత దట్టంగా సృష్టంచసాగింది”. అలా గూళ్ళు కట్టుకొంటూ అదే అడవిలో ఒక బిల్వ వృక్షం మీదకు చేరింది”. “అక్కడ కూడా గూళ్ళు కట్టుకుంటూ జీవించ సాగింది. ఇంతలో శివరాత్రి ఉత్సవాలు ప్రారంభం అయింది.” చివరగా శివరాత్రి రానేవచ్చింది. ఆ రాత్రి ఒక బిల్ల జాతి వాడు ఆ సాలెపురుగు నివసిస్తున్న బిల్వవృక్షషం మీద ఎక్కి దూరంగా ఏమైన లేళ్ళు కనపడుతా యని చూడసాగాడు. కాని కనిపించలేదు. ఐనా చూస్తున్నాడు. ఇంకా ఏమి లాభంలేదు. అర్థరాతి పండు వెన్నెలలో ఎక్కడ ఎముందే తెలిసి పోతుంది. కానీ బోయవాడికి వేట ఏమి కనిపించలేదు. “ఆ తోందర పాటులో వాడు బిల్వ వృక్షనికి ఉన్న కొమ్మల ఆకులను తుంచి ఒక్కొక్కటి క్రింద పడేయ సాగాడు ఐతే ఆబోయి తుంచి వెస్తున్నా బిల్వ ఆకులు అ పక్కనే ఉన్న అడవిలో నే వెలసిన ఒక శివలింగం మీద పడసాగాయి. అయితే అందులో ఒక ఆకులో కాపురం ఉంటున్న మన సాలెపురుగు బోయి తుంచి వేసేశాడు.అది కూడా శివలింగం పై పడింది. సాలెపురుగు రూపంలో ఉన్న ఊర్ణనాభునికి దైవదర్శనం అయింది. ఆకులో నుంచి బయటకు వచ్చి శివ లింగాన్ని కళ్ళు ఆర్పకుండా చూడడం మొదలెట్టీంది. “ఈ లింగాన్ని నిత్యం పూజిస్తే పాపం పోతుందని ఆ తరువాత మోక్షం సంపాదించు కోవచ్చు అని బావించింది.” “అలా! ఆలోచించిన ఊర్ణనాభుడు అంటే సాలెపురుగు శివుని కటాక్షం ఎలా పోందాలా అని తెగ అలోచించేసాడు”. చివరికి ఒక రోజు భయంకరమైన వర్షం పడింది. సాలెపురుగు రూపంలో ఉన్న ఊర్ణనాభుడు. ఒక తాటి ఆకు కింద తలదాచుకున్నాడు. అప్పుడే వాడికి ఒక ఆలోచన వచ్చింది. వెంటనే ఒక సారి శివలింగం వైపు చూసాడు. వర్షానికి శివలింగం తడిసి ముద్దవుతుందని ఇక మీదట శివలింగం తడవకుండా ఎండ తగలకుండా ఒక గుడి, ఆ తరువాత గోపురం కట్టాలని నిర్ణయించు కొన్నాడు. ఎలా మళ్ళీ అదే ఇటుకలు, సిమెంట్ సాలెపురుగు తేలేదు, కదా! “తన బోడ్డులోనే ఒక గ్రంధిని సృష్టించి ఒక రకం జిగురును సృష్టించి నూలుపోగులా చేసి వాటితో గూళ్ళు కట్టినట్టే శివలింగానికి కూడ గుడి, గోపురం ప్రకారం ఎంతో అందంగా కట్టింది”. “పోద్దున పూట ఐతే ఆ గూళ్ళ పై మంచు బిందువులు తెల్లగా ముత్యాలు లా క్రమేనా ఆ సుర్యాకాంతి పడి శివలింగం మెరవసాగింది”. ఎంతో అందంగా వెలసింది. రంగు రంగుల గా మెరిసే నవరత్నాలతో కట్టినట్లు గా కనపడసాగింది. కాని ఆ కట్టడం గట్టి దనం లేక పోవడంతో మట్టిపడి బరువై గాలికి గూళ్ళు చెదిపోసాగింది. ఇది కూడా బ్రహ్మ శాపమే అప్పుడే నాసృష్టి కన్న నీసృష్టి నిలిచి ఉండేనా! అని శపించాడు. అందుకే ఎంత గట్టిగా కట్టినా తెగి ఊడిపో సాగింది. అయినా సరే ఊడిపోయిన వాటిని పోద్దులస్తుమానం గూళ్ళు నిర్మిస్తూ ఉండిపోయింది. ఐతే విసుగు విరామం లేకుండా అలా అతుకులు పెడుతూనే ఉండేది. సాలెపురుగు ఐనా ఊర్ణనాభుడికి లింగంపై అంత భక్తి అన్నమాట. “ఇలా కొంత కాలం తరువాత శివుడు సాలె యొక్క భక్తి ని పరీక్షిద్దమని అనుకున్నాడు. ఆ మరునాడు పెద్ద గాలి రావడంతో గూళ్ళు చెదిరిపోయాయి. తక్షణమే అది గమనించిన సాలె అల్లడం మొదలు పెట్టింది. గుడి, గోపురం పూర్తి కాగానే అగ్ని పడి గుడి గోపురం కూలిపోయింది. మళ్ళీ నిర్మించింది. కానీ అగ్ని రావడంతో కూలి పోయింది. ఇలా అనేక సార్లు కట్టినప్పటికి గూళ్ళు కాలిపోసాగగా చివరిగా ఆ సాలే అగ్ని వచ్చే సమయం చూసి ఆ అగ్నిని తనజిగురుతో ఆర్పాలనే ఉద్ధేశ్యం తో ఆగ్నికి ఆహుతి ఐపోయింది. “ఇది చూసిన శివుడు ఆశ్చర్య పోయాడు.” ‘అబ్బా!ఈ సాలెపురుగు కి ఎంత భక్తి అనుకున్నాడు.’ తక్షణమే లింగంలో నుంచి ప్రత్యక్ష మై ఊర్ణనాభ అగ్నిలో దూకి నీ పాపాన్ని గర్వాన్ని పోగొట్టు కొని పుణీతుడవు అయినావు, నీ భక్తితో నన్ను పరవశం చేసారు, మహానందం పొందాను ఏమైనా వరం కోరుకో ఇస్తాను అన్నాడు పరమేశ్వరుడు. ఇక శివుడే వచ్చి వరం కోరుకో అనగానే సాలె చాలా సంతోషంతో స్వామి మా జాతికి ఎక్కడైనా సరే గూళ్ళు కట్టుకొనేస్వేచ్ఛను ఆ తరువాత ఎంత గొప్ప వారి గా పుట్టిన బాధలు లేకుండా జీవించటం కష్టమని, జ్ఞానం అయింది. కాబట్టి నాకు జన్మలేకుండా నీలో ఐక్యం చేసుకోని నాకు మోక్షం ప్రసాదించు స్వామీ అని కోరుకుంది. ఇలా సాలెపురుగు గా శాపం పొందిన ఊర్ణనాభుడు తరించాడు. ఊర్ణనాభు అంటే సాలెపురుగు ఆ శివుడు ఇచ్చిన వరంతో ప్రతి ఇంట్లో ను భవనాలలో చెట్లు చెమలో గూళ్ళు కట్టుకొని సంతోషంగా జీవిస్తుంటాయి. ఇదే “సాలెపురుగు అసలు కథ”

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!