విచిత్ర జీవితము
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
సమీక్షకులు: నారు మంచి వాణి ప్రభా కరి.
డాక్టర్ విధుల కథ విచిత్ర, జీవితంలో వృద్ధులైన తల్లి తండ్రినీ చూడటానికి ఎవరూ ఉండరు, అయితే కూతురు, కొడుకు సూర్య వచ్చి చేదోడు వాదోడుగా ఉంటాడు. అతనికి మంచి ఉద్యోగం వచ్చి వెళ్లిపోయే రోజు వచ్చింది ముందు గడవదు అని భాధపడిన తరువాత వాడు ఎదగాలి అని దీవించారు. ఇంట్లో వంటకి మనిషి కోసం వెతికారు కానీ ఎవరూ లేరు,
ఇంటి ఆయన పేపర్స్ కి వ్యాసాలు రాస్తారు. ఆ సబ్ ఎడిటర్ నీ అడిగితే నెలకి ఇరవైతొమ్మిదివేలు, అన్ని సుఖాలు మీ ఇంటి కన్న బాగుంటాయి. బయటకు వెళ్లి రావాలి, అంటే కారు ఇస్తారు. అన్ని సుఖాలు ఉన్నాయి అని చెప్పాడు. పిల్లలు విదేశాల్లో ఉన్నారు. వాళ్ళు సరే అంటారు. ఎందుకంటే డబ్బు ఉన్న తిండీ రాని పరిస్థితి వాళ్ళ దగ్గరకి ప్రేమతో తీసుకెళ్లిన, వీళ్ళు నెలకి మించి ఉండలేరు, ఆరు నెలలు ఎక్కడ ఉంటారు. డబ్బు ఖర్చు పెట్టే తీసుకెళ్లేడమే కానీ ఉపయోగంలేదు. శనివారం ఆదివారం వచ్చే వరకు అక్కడ టి.వి చూస్తు కూర్చోవాలి. స్వాతంత్య్రం ఉండదు, అంటూ వాపోయారు,
ఆడపిల్లులు మాత్రం, పిల్లులు ఉండి ఇలా అయిందని పరిస్థితి అని భాధ పడ్డారు. అయితే అన్నపూర్ణమ్మ, ఈ కథ హీరోయిన్ ఇల్లు అంతా పద్ధతిగా ఉంటుంది. పాల వాడే అన్ని తెచ్చి ఇచ్చేలా పురనాయుంచుకుని, పాలకుక్కర్లో పాలు, ఇడ్లీ కుక్కర్ లో అన్నం, ఇంకో కుక్కర్లో పప్పుటమాట పెట్టారు. అన్ని విజిల్స్ వచ్చాక కట్టేస్తారు. ఇంట్లో నెలకి సరిపడా పోపు ఉంటుంది. అధి వేసుకు నీ కలిపి తింటారు. ఇలా జీవితాన్ని మలచుకున్నారు. మనుష్యులు మధ్య ఆత్మీయత అనందం లేవు. అవన్నీ ఇంకా వచ్చేవి, కవి జీవితం విచిత్రంగా చిత్రంగా గడుపుకోవాలి. ఈ తరహా కథ ఎంతో నీతి బోధిస్తూ సమాజ ధోరణి విశ్లేషించింది.