పూజ (సినిమా సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: శ్రీమతి వాణి
సమిక్షకులు: సుజాత కోకిల.
అది ఒక చిన్న పల్లెటూరు. ఆ ఊర్లో ఏ గొడవలైనా సమస్యలున్నా అక్కడ రచ్చబండ దగ్గరే చెప్పుకోవాలి. అక్కడ పోలీసులు రావడం కోర్టులంటూ అవి ఏవి ఉండవు. ఊరిలోని జమిందారు కిష్టయ్యగారు ఏదైనా అతను చెప్పిందే వేదవాక్కుగా ఉంటుంది. ఎవరికి ఏ కష్టం వచ్చినా చాకచక్యంగా తీర్పు చెప్పి సమస్యలను, చక్కదిద్దేవాడు అందరి కష్టసుఖాలు తెలుసుకుంటూ ఆర్థికంగా కూడా ఆదుకుంటూ ఉండేవాడు. ఆ ఊర్లో అందరూ అతన్ని దేవుడిగా కొలుస్తారు. ఏ ఇంట్లో శుభకార్యం జరిగినా ముందుగా తన ఇంట్లోంచి వెళ్లాల్సింది. పెళ్లికి కావలసిన పుస్తెలు, మట్టెలు పట్టువస్త్రాలు, తన భార్య సీతమ్మతో ఇప్పించేవాడు. భర్తకు అనుకూలంగా నడుచుకుంటూ ఉత్తమ ఇల్లాలుగా పేరు తెచ్చుకుంది. సీతమ్మగారు ఆ జమీందారు గారికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. ఇది పల్లెటూరు కావడంతో పట్నంలో చదివిస్తున్నారు. అదే ఊర్లో జమీందారుగారి చెల్లెలు కూడా అక్కడే ఉంటారు. ఆమె పేరు సురేఖ, తనకు ఒక్క కూతురు ఉంది. అన్నకు తగ్గ చెల్లెలు అన్నయ్య అంటే ప్రాణం,
ఒకరింటికి ఒకరు వస్తూ పోతుంటారు. మేనకోడలు కమల అంటే ప్రాణం, రోజు వస్తూ తనని ప్రేమగా చూసుకుంటుంది. సురేఖ భర్త దూకుడు మనిషి. భావకు మంచి పేరుండడంతో తట్టుకోలేక పోయేవాడు, కానీ అది పైకి కనిపించకుండా ఉండేవాడు. తన గురించి ఏదో ఒకటి తప్పుడు మాట చెప్పి చెడు చేయాలని చూసేవాడు.
కానీ అతని మాట ఊర్లో ఎవరు నమ్మరు ! అయినా అలాగే ప్రయత్నిస్తుంటాడు. ఊర్లో అందరితో విరోధం పెట్టుకునేవాడు జెమీందార్ బావమరిది అని ఊరుకునేవారు. అర్జున్ చదువుకునే కాలేజీలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. వీడ్కోలు పార్టీ తర్వాత అమ్మానాన్నతో చెప్పి నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి వెళ్తాడు. నీ కోసం ఎదురు చూస్తాని చెప్పింది. సరే అన్నాడు. మంచి టైం చూసుకుని చెప్పాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడే అర్జునికి ఉద్యోగం రావడంతో మరునాడే జాయిన్ అవ్వాలని కాల్ లెటర్ రావడంతో అప్పుడే పెళ్లి గురించి ప్రస్తావించకూడదు అనుకున్నాడు. తప్పనిసరి అయి ఉద్యోగానికి వెళ్లాల్సి వచ్చింది. కొద్దిగా స్థిరపడ్డాక చెప్పాలనుకున్నాడు. అలా సంవత్సరం గడిచింది.
తల్లికి సీరియస్గా ఉందని కాల్ రావడంతో కంగారుగా వెళ్లాడు. ఎదురుగా గుమ్మంలోనే కమల ఎదురుగా కనబడింది. బావ వచ్చావా, రా బావ నిన్నే కలవరిస్తోంది బావ అంది! అత్తయ్య ఉన్న గదిలోకి తీసుకు వెళ్లింది. కదలలేని స్థితిలో ఉంది. కమల అన్నీ తనే చూసుకుంటుంది. అత్తయ్య బావొచ్చాడు చూడు అంది. కళ్లు తెరుస్తూ వచ్చావా బాబూ అంది. ఆ వచ్చానమ్మా, నువ్వేమీ కంగారుపడకు నీకేం కాదని సర్దిచెప్తాడు. తల్లిని అలా చూడటంతో కంటి నీరు ఆగలేదు. ఎందుకేడుస్తావు అయిన ఎప్పుడో ఒకప్పుడు రాలిపోయే దాన్ని బాధపడకు బాబు అంది. అమ్మ అలా అనకు అన్నాడు బాధగా అక్కడికి మామయ్య, నాన్న వచ్చారు. వచ్చావా బాబు నిన్నే కలువరిస్తుంది. అన్నారు. మేం ఎంత చెప్పినా ఏం తినడం లేదు బాబు. బాబు నేనొక కోరిక కోరతాను నెరవేరుస్తావా అంది. చెప్పమ్మా అదేంటి బాబు చెప్పాక కాదనకూడదు అంది. నాకు ముందు మాట ఇవ్వు తర్వాత చెప్తాను. అమ్మ నాపై నమ్మకం లేదా అన్నాడు. అది కాదు నాయనా!వింటానని మాట ఇస్తున్నాను చెప్పమ్మా అన్నాడు. ఇంతకు ఆ విషయమేంటో మాకు కూడా చెప్పలేదురా అన్నారు ఇద్దరు. కమలను పిలిచి తన చేతిని అర్జున్ చేతిలో పెట్టి కమలను పెళ్లి చేసుకోవాలి రా అంది. అందరూ షాక్ అయ్యారు. తల్లిని ఈ పరిస్థితుల్లో చూసి ఏం చెప్పాలో అర్థం కాలేదు, కాదని ఎలా చెప్పాలి అనుకున్నాడు. మనసులో ప్రేమించిన అమ్మాయి పరిస్థితి. ఏం కావాలి అంటూ మనసులో బాధపడ్డాడు. కాదు అంటే అమ్మ పరిస్థితి ఏంటి. ఎందుకు ఇరకాటంలో పెట్టావు దేవుడా అనుకున్నాడు. మనసులో
కమల నిన్ను ఎంతగానో ప్రేమిస్తుంది. నువ్వంటే ప్రాణం ఇది బాగానే ఉంది నీకిష్టమైతే మా అందరికీ ఇష్టమే బాబు అన్నారు. సంతోషంగా అనుకోకుండా కమలతో పెళ్లి జరిగింది. పోతుందన్న సీతమ్మగారు కమల ప్రేమతో బ్రతికి బయటపడింది. హుషారుగా తిరుగుతుంది. అత్తయ్య మీరు కూడ మాతో రండి ఇక్కడే అందరం కలిసి ఉండొచ్చు అంది కమల. లేదమ్మా మేం మళ్లీ వస్తాంగా మీరు వెళ్లండంటూ ఇద్దరిని పట్నం పంపింది. ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక కమలతో ముభావంగా ఉంటున్నాడు. ఎడమొహం పెడమొహంగా ఉంటున్నారు. కమల ఎంత దగ్గర అవ్వాలనుకున్న దూరంగా ఉంటున్నాడు. అత్త బలవంతంపైనే చేసుకున్నాడని అర్థమైంది. కమలకు బావలో మార్పు వస్తుందని మౌనంగా ఉండిపోయింది. తలదిండు తీసుకొని నేలపై పడుకోబోయాడు వద్దు బావ మీరు పైనే పడుకోండి, నేను కింద పడుకుంటానని దిండు తీసుకుంది. ఇటు కమలతో సరదాగా ఉండలేక అటు ప్రేమించిన అమ్మాయిని మర్చిపోలేక సతమతవుతున్నాడు. కొత్త కాపురం ఎలా ఉందో చూడాలని అర్జున్ తల్లిదండ్రులు వచ్చారు. కమలను చూడగానే ఆశ్చర్యపోయారు ఎంతో హుషారుగా వుండే పిల్ల మొహంలో సంతోషంలేదు. కొత్త జంట ఎంతో హుషారుగా ఉంటారు అనుకున్నారు. ఆ హుషారే లేదు ఏంటండీ ఇలా ఉన్నారు అంది భర్తతో, నాకు మాత్రం ఏం తెలుసు అన్నాడు. మనం ఉంటే ఎంత ఇబ్బంది పడుతున్నారేమోనని తిరుగు ప్రయాణం అయ్యారు. అదేంటమ్మా అప్పుడే వెళ్లిపోతున్నారు. కొన్నిరోజులు ఉండొచ్చు కదా అన్నాడు. కాదు బాబూ పొలం పన్నులున్నాయి. ఇలా చూసి వెళ్దామని వచ్చాం, మళ్ళీ వస్తాం అంటూ వెళ్లారు. బావ అన్నం పెట్టాను రా అంది. నాకు ఆకలిగా లేదు అన్నాడు. ఒక్క ముద్ద తిను బావ కాదనలేక ఒక ముద్ద తిని లేచాడు. అదేంటి బాలేదా అనుకుంటూ తానొక ముద్ద తిని చూసింది బాగానే ఉంది కదా అనుకుంది. మనసులో బాధపడింది. అప్పుడే మామయ్య దగ్గర్నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ తీసుకుని హలో అంది. నేనమ్మ మామయ్యను అన్నాడు, ఆ బాగున్నారా మామయ్యా? వాడు లేడా తల్లి మామయ్య బావ డ్యూటీకి వెళ్లారు. ఏమైనా చెప్పాల అవునమ్మా రాధను చూసుకోవడానికి పెండ్లివారు వస్తున్నారు. బావ వచ్చాక చెప్తాను మామయ్య సరే మరి వుంటాను. అని ఫోన్ పెట్టేశాడు దూరపు బ్బంధువు మాధవ్, రమ వచ్చారు. ఇద్దరు ప్రేమించుకున్నారు. ఇంట్లో వద్దనడంతో చెప్పకుండా ఇలా వచ్చారు. ఏంటి మాధవ్ ఇలా వచ్చావ్ అంటూ అడిగాడు. బావ నేను రమను ప్రేమించి పెళ్లి చేసుకున్నాను. చెప్పకుండా ఇంట్లోంచి వచ్చాను. ఏదైనా పని ఉంటే ఇప్పించు బావ అన్నాడు. మా లైబ్రరీలో పోస్టు ఖాళీగానే ఉంది చేస్థావ అన్నాడు. అన్నయ్య బాగున్నారా! అంటూ ఇద్దరిని పలకరించింది కమల. అర్జున్, మాధవన్ కు ఉద్యోగం ఇప్పించాడు. మాధవ్, రమ రావడంతో వారి ప్రవర్తన అర్జున్ లో మార్పు కనిపించింది. కమలను ప్రేమగా చూడటం మొదలు పెట్టాడు. కమల కూడా వేషాధారణ మార్చుకుంది. బావకు నచ్చినట్టుగా ఉండాలని. మోడ్రన్ డ్రెస్సులు వేసుకోవడం మొదలు పెట్టింది. అలాగైనా తనని ఇష్ట పడతాడేమోనని మళ్ళీ అంతలోనే ముభావంగా ఉంటున్నాడు. ఏడుస్తూ ఒకరోజు బావ ఎందుకు ఇలా ఉంటున్నావు. ఇలా ఎన్నాళ్లు నేనంటే ఎందుకు ఇష్టం లేదు. మీ ప్రేమ నాకు కావాలి మిమ్మల్ని ఎంతగానో ప్రేమిస్తున్నాను. మీ మనసులో ఏముందో చెప్పండి, అంటూ వేడుకుంది కమల. ఇప్పుడు నన్నేమీ అడక్కు నన్ను క్షమించు కమల అంటూ వెళ్లాడు. పక్కింటి శ్యామల కమల అంటూ పిలిచింది. ఈ రోజు మా ఇంట్లో గౌరీ వ్రతం వుంది రావాలమ్మా అంది. నీరసంగా ఉండడంతో ఏంటి కమల ఇలా ఉన్నావు ఇంకా పిల్లలు కాలేదనెే కదా ఈ బాధ అంది. అదేం లేదండీ వాళ్ల ఇంటికి గౌరీపూజకీ వెళ్లిందిరా అమ్మా కమల అంటూ ఆప్యాయంగా పలకరించింది. పంతులుగారు ఒక పాట పాడండి ఎవరైనా అన్నాడు. కమల నీవు ఒక మంచి పాట పాడమ్మా అంది. అలాగే అంటూ శ్రావ్యంగా మంచి పాట పాడింది తాంబూలం తీసుకొని వచ్చింది. అర్జున్ వర్షంలో తడిచి వచ్చాడు. చేతికి టవల్ ఇచ్చింది. తడవడంతో బాగా జ్వరం వచ్చింది. వర్షంలోనే డాక్టర్ ను తీసుకవచ్చి చూపించింది. ఏం ఫర్వాలేదు అని చెప్పివెళ్లాడు. మరునాడు మళ్లీ డాక్టర్ దగ్గరకు వెళ్లి వస్తానని వెళ్లాడు. తను ప్రేమించిన అమ్మాయి ఫ్రెండ్ ను పెళ్లి చేసుకుంది. నేను ఇన్ని రోజులు ఆ భ్రమలో ఉండి నా జీవితాన్ని మిస్ చేసుకున్నాను. అని బాధపడుతూ ఇంటికి వచ్చాడు. కట్టుకున్న భార్యకు ద్రోహం చేశానని తెలుసుకున్నాడు. నన్ను క్షమించు కమల అంటూ కమలను అక్కున చేర్చుకున్నాడు. కమలకు ఎక్కడలేని సంతోషంతో మెట్లు దిగుతూ పడిపోయింది. కమల తల్లిదండ్రులకు, అర్జున్ తల్లిదండ్రులకు, అంత తెలిసిపోయింది చాలా బాధపడ్డారు. తప్పు చేశానని తెలుసుకొని కమలను కంటిపాపలా చూసుకోవడం నా బాధ్యత అనుకోని ప్రేమగా చూసుకోవడం మొదలుపెట్టాడు. ఇదంతా నా పూజా ఫలితమే నాకు దక్కింది అంటూ సంతోషపడింది.