తెనాలి రామకృష్ణ కథలు (పుస్తక సమీక్ష)
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: రాజేశ్వర రావుగారు
సమిక్షకులు: పి. వి. యన్. కృష్ణవేణి
తెలుగులో అత్యంత ప్రముఖ కవిగా పేరు పొందిన తెనాలి రామకృష్ణుడు. వికటకవిగా కూడా ప్రసిద్ధి చెందారు. వికటకవి అంటే హాస్య కవిగా ప్రాముఖ్యం చెందారు. నవ్వు నాలుగు విధాల చేటు అన్నది ఒకప్పటి మాట. ఇప్పుడున్న ఈ హడావిడి జీవితాల్లో నవ్వడమే ఆరోగ్యం అనేది నేటి సూక్తి.
శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలో ఆయనకు ఒక ప్రత్యేకస్థానం ఉంది. అందుకే ఆ కథలను వివరించిన రాజేశ్వరరావు గారి కథ సంపుటి నాకెంతగానో నచ్చింది. సరళ భాషలో కథలను వివరించడమే కాకుండా, నవ్వు తెప్పించే విధంగా ఉండే ఆ కథలను పిల్లలను ఆకట్టుకునే విధంగా ఈ రచయిత వర్ణించడం ఇంకా అద్భుతం. ఈయన రాసిన అనేక కథలలో, ఒక కథ అయిన శ్రీకృష్ణదేవరాయల స్వప్న వర్ణన చాలా అద్భుతంగా ఉంటుంది. అలాగే ఇందులో తెనాలి రామకృష్ణుడు ముసలివాడిగా తయారయి రావడం మీరు నా డబ్బులు దొంగిలించారు అనడంతో, రాజుగారు అవాక్కయి చూస్తూ ఉంటారు. మారువేషం తీసేసి, తరువాత మీరు కన్న కల కదిలే భవనాలను నిర్మించడం అసాధ్యం అంటూ ఆయనకు వివరించడం చాలా నవ్వు తెప్పిస్తాయి. పిల్లలకు ఇలాంటి కథలు చెప్పడం వల్ల వినోదంతో పాటు, విజ్ఞానం ఆలోచన విధానాన్ని కూడా పెంచుతాయని చెప్పడంలో ఎటువంటి అనుమానం లేదు.