ముసుగు లేని మనిషి

(అంశం – మానవత్వం ముసుగులో వ్యాపారం)

ముసుగు లేని మనిషి

రచయిత :: సరిత రవిప్రకాష్

ముసుగు ముసుగు
తనని తానే మరిచిపోయే ముసుగు,
భారీ మొత్తంలో వేసుకున్న మానవత్వపు ముసుగు మీరు తీసుకోండి తీసుకోండి అని అరుస్తున్నడూ
ఆ కొట్టు నడిపేవాడు…

బీదవాళ్ళు ,ధనికులు, యువకులు, ముసలివాళ్ళు, ఇలా అందరితో కిటకిట మంటోంది ఆ కొట్టు,
అక్కడ ఒక బోర్డ్ వేలాడుతోంది ఒకటి
కొంటె ఒకటి ఫ్రీ అని..

నవ్వు, ఏడుపు, శాంతి సహనం,ముసుగు
విధ విధాలైన రంగురంగుల కలల ముసుగులు,మీరు తీసుకోండి ముసుగులు..

తెలివిలేని వాడు తీసుకున్నాడు జ్ఞానం ముసుగు
స్వార్థపరుడు తీసుకున్నాడు
త్యాగపు ముసుగు,
అనైతికతతో బురద పూసుకున్నవాడు
ఒకడు నైతికత నిండిన ముసుగు తీసుకున్నాడు.
మీరు తీసుకోండి ఒక ముసుగు అని అరుస్తున్నాడు…

నిత్యం అబద్ధాలు ఆడేవాడు తీసుకున్నాడు
గాంధీ ముసుగు,
కోపంగా ఉండేవాడు బుద్దుని ముసుగు, తీసుకున్నాడు…

ముదుసలి తీసుకున్నాడు
యవ్వనం ముసుగు,
పక్షపాతబుద్ది ఉన్నవాడు నిష్పక్షపాత ముసుగు,
ప్రేమికుడు తీసుకున్నాడు ప్రేయసి జ్ఞాపకాలను మరిచే ముసుగు….

ముసుగు లేని
ముఖం ఒకటి లేదు
ముసుగు వెనక నిజమైన మాయ వెతకడానికి ఎవరికి చేతకాదు,
ఆ దేవునికే అర్థం
కానీ ఎన్నో ముసుగులు వేసుకున్నారు ఈ జనం
ఒక్కో మనిషికి ఒక్కో ముసుగు, ముసగులోనే ఎన్నో వ్యాపారాలు, ఎన్నో జీవితాలు సాగుతున్నాయి….

మంచివారు అనే
ముసుగు వేసుకున్నవారు మాత్రం ఎక్కడ దొరకరు ఇప్పటికి ఎప్పటికి..
ఇదే జీవితం నడిపే రంగుల ముసుగు ఆట…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!