బంధనాల బంధం

అంశం: స్వేచ్చా స్వాతంత్ర్యం ఎక్కడ!?

బంధనాల బంధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: చంద్రకళ. దీకొండ

వివాహమనే పసిడితీగల పంజరంలో బంధింపబడి…
స్వేచ్ఛా స్వాతంత్ర్యాలను కోల్పోయి…!
లేని ప్రేమను నటిస్తూ…
పడిన బంధాన్ని భరిస్తూ…
చెక్కబొమ్మలా అంతరంగ భావనలు బయటకు కనబడనీయక…
కాగితపు పూల వంటి
కృత్రిమ నవ్వులు మోముపై అతికించుకొని…!
అకారణంగా అందరిపై అరుస్తూ…
అసంతృప్తిని వెలిగ్రక్కుతూ…
సున్నితత్వాన్ని కోల్పోయి బండబారిన వివాహిత మనసు…
కళ్ళల్లో తగ్గిన సంతోష
కాంతుల మెరుపు …!
“నా జీవితం ఎందుకిలా…?!”
అనుకుంటూ…
ఆలోచనగా మెడ తడుముకుంటే…
చేతికి తగిలింది…
మెడలోని బంధనపు
గొలుసు …!!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!