సంతలో

సంతలో

రచన : యాంబాకం

విజయనగరంలో గోవిందుశెట్టి గోప్ప ధనికుడు అతనికి రాకేష్,లోకేష్,రాజేష్ అనే ముగ్గురు కుమారులు వారి ముగ్గురు నడవడికల లో వ్యత్యాసం ఉండేది కాదు.
అన్నదమ్ములు చాల బుద్ధి గా కలసి మెలిసి ఒకరంటే ఒకరికి ప్రేమ గా పెరగ సాగారు. వారి ముగ్గురు ఒక్క విషయం లో మటుకు ఒకరితో ఒకరు చెప్పకుని ఎరుగరు. అది వారు ముగ్గురూ కూడా వాళ్ళ మేనమామ కూతురైన నిరూపా ని ఒకరికి తెలియకుండా ఒకరు ప్రేమించారు.అమెనే ఎప్పటికైనా ఎలాగైనా సరె పెళ్ళాడి తీరాలని గట్టిగా నిర్ణయించుకొన్నారు.‌వారు ముగ్గురు మేనమామ కూతురైన నిరూపా ను చూడటానికి మామ ఇంటికి తరచూ పొతూ నిరూపా తో సరదాగా మాట్లాడి వచ్చేవారు. ఒక్కొక్క రోజు ఆమె వీణా సంధ్యా రాగాలు డాన్స్ ఆలాపన చేయగా వారు.  ఆనందించే వారు. కాని అన్నదమ్ములు మటుకు తమలో తాము నిరూపా గురించి ఎన్నడూ మాట్లాడు కునేవారు కాదు.
అలా కాలం గడవ సాగు తుండగా ఒకరోజు తండ్రి గోవిందు శెట్టి తన కమారులను ముగ్గురి ని పిలిచి ఈ విధంగా చెప్పాడు. “కుమారులారా! నేను వృద్దుడునై పోయాను. నేను సంపాదించిన ధనం తో  మీరు సుఖంగా జీవించేయ వచ్చును.కానీ అది మగవారి లక్షణం కాదు. మీరు వివాహం నంతరం సంసారం,బిడ్డలు కలుగు తారు క్రమంగా ధనం తరిగి పోతుంది.ఎదైన పని ఉద్యోగం చేసి సంపాదించిన తరువాత నే పెళ్లి  చేసుకొని స్థిర పడండి అని జాగ్రత్తలు చెప్పాడు.
తండ్రి గోవిందు శెట్టి చెప్పినట్లు గానే రాకేష్ లోకేష్ రాజేష్ దేశంనలుమూల పోయి వ్యాపారం గాని ఉద్యోగం గాని చేసి డబ్బు సంపాదించి రావాలని తండ్రిగారిని సంతోషపెట్టాలని అనుకొని కొంత డబ్బులు తీసుకొని ఒక మహానగరం చేరి అక్కడ “సంత లో “వ్యాపారం చేయాలని ముగ్గురు ఈ మహానగరం లో ఒక గది తీసుకుని ముగ్గురం ఒకే దగ్గర కంటే విడివిడిగా పోయి వ్యాపారం చేసుకొని తిరిగి రెండు సంవత్సరాల తరువాత ఇదే గది లో కలుసు కొందామని ముగ్గురు విడిపోయారు.
చూస్తూ ఉండగనే రెండు సంవత్సరాలు గడిచిపోగా ముగ్గురు అన్నదమ్ములు ఒకరి తరువాత మరొకరు గది కి చేరారు. ముగ్గురు తండ్రి చెప్పినట్లుగానే లాభాలు పొందారు. వారు తిరుగు ప్రయాణం కట్టారు.
సొంత ఊరికి బయలు దేరిపోతూ ఉండగా దారి లో వారికి ఒక విచిత్రమైన సంత కనిపించింది ముగ్గురు కలిసి “సంతలో”చూడ గా వారికి మరపించే చిత్ర,విచిత్రమైన వస్తువులు కనపడగా వాటిని కొనాలని అనిపించి మొదట తరిగి తిరిగి ఒక సంజీవి మూలిక తో తయారు చేసిన గుల్లిక ను చూసి దాని మహిమ ఎంత జబ్బులను పాణం పోతున్న సమయంలో కూడదాన్ని మింగితే నయం అయిపోతుంది. అని దాని గురించి “సంతలో”ని వారి ద్వారా తెలుసుకొని చివరి వాడైన రాజేష్ యాబైవేలు పెట్టి గుల్లిక ను కొన్నాడు. రెండువ వాడైన లోకేష్  తిరిగి తరిగి చూడగా వాడికి ఒక కారు కనిపించింది దాని లో ప్రయాణం అతి సునాయాసంగా ఎంత దూరమైన ఇంధనం లేక పొయిన రోడ్డు పైన, ఇసకలో, నీళ్ళలో, కూడా ప్రయాణం చేయగల వాహనం చూసి సంతోషంగా లక్ష రూపాయలు పెట్టి కొన్నాడు.అందరికన్న పెద్దవాడైన రాకేష్ సంత మొత్తం తిరిగి తిరిగి ఎది నచ్చక వస్తూ ఉండగా”సంతలో “.చివరి లో వాడికి లాకెట్ కనిపించింది. దానికి ఒక విచిత్రం ఉంది.లాకెట్ తేరిచి చూస్తే దానిలో మనం ఎవరినైతే ఎక్కవ గా తలచు కొంటాయో అదే.  కనిపిస్తుంది.
రాకేష్ లాకెట్ ను నచ్చిన వాడై బేరం చేసి యాభై వేల రూపాయలు పెట్టి కొని వెంటనే తేరిచి చూడగా మామ కూతురు అయిన నిరూపా కనపడింది.అతను ఎప్పుడూ నిరూపా నే తలచుకొనే వాడేమో కానీ నీరూపా చావు బ్రతుకుల మధ్య ఉన్నట్లు కనపడింది. వెంటనే రాకేష్ లోకేష్ కు చూపగా వెంటనే లోకేష్ కొన్న వాహనం పై ముగ్గురు మరదలను చూడడానికి బయలుదేరి మేనమామ ఇంటికి చేరుకొని చూడగా నిరూపా కు ఎదో జబ్బు తో తీవ్రంమైన పరిస్థితిలో ఉందని చూసిన రాజేష్.వెంటనే తన దగ్గర ఉన్న సంజీమూలికగుల్లిక గుర్తు కు వచ్చింది. దానిని నిరూపా నోటిలో వేసి మింగించాడు. నిరూపా అరగంట లో మామూలస్థతికి వచ్చింది. అందరూ ఆ ముగ్గురు అన్నదమ్ముల లను మెచ్చు కొగా మేనమామ ముగ్గురి కి కృతఘ్నతలు చెప్పి ఇక్కడ కొంతకాలం ఉండ మన్నాడు.
కొన్ని నెలల తరువాత నిరూపా పెళ్ళి చేయాలని నిరూపా తండ్రి ముగ్గురి లో ఎవరు చేసుకొంటారని మేనమామ ముగ్గురిని పిలిచి అడిగాడు. ముగ్గురూ నిరూపా ను చేసుకోదలచినట్లు చెప్పగా మామకు ఏమి చేయాలో తెలియక తన కూతురి ప్రాణాలు కాపాడిన ముగ్గురిని కాదన లేక ముగ్గురి కి ఇచ్చి పెళ్లి చేయడం కష్టం కనుక అలోచనలో పడ్డాడు. మేనమామ నిరూపా తండ్రి అప్పుడు ఈ సమస్య నిరూపా వాళ్ళు ముగ్గురిమామ లది కాబట్టి వాళ్ళ నే తేల్చుకొమ్మన్నాడు.
చివరికి నిరూపా కలగచేసుకొని ముగ్గురు మామయ్యలతో,!ఇలా అంది! “మీ ముగ్గురు నాప్రాణ దాతలే పెద్ద మామయ్య రాకేష్ లాకేట్ లో  చూసి నా పరిస్థతిని కనుగొన్నారు.  రెండవ మామ లోకేష్ తన వాహనం పై సమయానికి మీఇద్దరి ని తీసుకోచ్చాడు. ఇక చిన్నమాయ్య రాజేష్ తను కొన్న సంజీవిమూలిక గుల్లిక తో నన్ను బ్రతికించాడు. కాబట్టి ముగ్గురు సమానం గా  స్పందించి నా ప్రాణం కాపాడినారు. మీకు కృతజ్ఞతలు కాని మీ మహిమ గల వస్తువులు మీదగ్గరనే ఉన్నాయి. పెద్ద మామ లాకెట్ గాని రెండవ మామ వాహనం, గాని,  కానీ చిన్న మామ రాజేష్ కొన్న సంజీవి మూలికగల్లిక లేదు. అది నన్ను బ్రతికించేదానికి.  మింగించాడు. అతని కి ఇక నేను తిరిగి ఇవ్వలేను. కాబట్టి!నేను చిన్న మామయ్య అయిన రాజేష్ ను పెళ్లి చేసుకోవడమే న్యాయం” కాబట్టి నేను రాజేష్ మామ నే పెళ్లి చేసుకోవడం న్యాయం అని నిరూపా నిర్ణయం చెప్పగా అందరికీ నచ్చి సంతోషంగా రాజేష్ కి నిరూపా కి సంతోషంగా ఘనంగా పెళ్లి చేసి రాకేష్ ,లోకేష్ లు కూడ పెళ్ళి చేసుకున్నారు. తండ్రి గోవిందుశెట్టి చాల సంతోషంగా ముగ్గురు కొడుకులను చెప్పిన ప్రకారం ప్రయోజకులు అయినందుకు మనసార దీవించాడు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!