జంతుప్రేమ

జంతుప్రేమ

రచన: పుష్పాంజలి

మనకు  ప్రియమైన  ఆహారం  దేవునికి  నేవేద్యం  చేసి నలుగురుకి  ప్రేమగా  పంచడం నిజమైన ఆనందం..

ఆహారం  ప్రతిప్రాణికి  అవసరమే అలాగే  ప్రేమ.. ప్రేమ అనేక రకాలుగా వుంటుంది.  అది ఎప్పుడూ పుడుతుంది,ఏలా పుడుతుంది చెప్పాను అలవి కాదు.

తను ప్రేమించిన ప్రియుడు  లేదు  భర్త ఐ లవ్ యు బంగారం అంటే  ప్రపంచమునే జయించిన అంత ఆనందం. మహిళలకు అది బయట వారి  నుండి కాదు అనుకొండి.

సృష్టిలో  ప్రతిప్రాణి  ఆ భగవంతుని బిడ్డాలు భగవంతుని సృష్టి కదా.

నేను జరిగిన సంఘటన రాస్తాను చదవండి….

మేము హైదరాబాద్ నుండి తిరుమల  వచ్చాం.   తిరుమల వేంకటేశ్వరుని దర్శనం  అనంతరం తిరుచానూరు అమ్మవారిని శ్రీ కాళహస్తికీ వచ్చాం. దేవాలయమునకు వెళ్లి దర్శనం  అనంతరం    హైదరాబాద్ కు తిరిగి ప్రయాణం నారాయణద్రి  కోసం రైలుసేష్టన్ లో వేచియున్నాం. నాకు ఆకలిగా  వుంది  ర్తెలుప్రయాణం ఇబ్బంది లేదు చిప్స్ అంటే నాకు  చాల ఇష్టం.. అది  తీసుకుని తిందామని ఒపన్ చేసాను . ఇంతలో ఒక  తెల్లకుక్క తోక  ఉపుకుంటా నా దగ్గరకు వచ్చింది . అది విచిత్రంగా మా కుటుంబ సభ్యులని ఐదుగురుని దాటి  అక్కడ  ప్లాట్ ఫామ్ మీదా ఇంకా చాలా మంది వున్నారు  వారు కుడా తింటన్నారు. నేను తినబోతున్నా  చిప్స్  దానికి  పెట్టె అది  నా  చేతినుండి  తీసుకుని  తినసాగింది.

అది   గమనించిన  ప్రక్కనే  వున్నావారు. వారు కూడ ఇవ్వాలని ప్రయత్నం చేశారు, ఉహు అది ముట్టుకోలేదు. దానితో మా కుటుంబం కూడ  ప్రయత్నం  చేసారు, అది తీసుకోలేదు  తిరిగి నేను పెడుతుంటే అది తినసాగింది . ప్రక్కనే  వున్నా  అతను  మేడమ్  దానికి మీరు  నచ్చారు  కాబట్టి  మీరు  ఇది  కూడ మీరే  పెట్టియండి  తనతో  వున్న  ప్యాకట్  నా చేతికి   ఇచ్చారు  కుక్క  తినేసింది …

అందరూ నవ్వుతూ నన్ను ఆ కుక్కనే చూస్తున్నారు. చిప్స్ అయిన తరువాత దానితో మాట్లాలాడం మొదలు పెట్టాను అది నామాటలకు తోక ఉపుతూ నా మీదకు ఎగురుతుంది ఆనందంగా.

ఇంతలో ట్రైన్  వచ్చింది అది నాతో  పాటు ట్రైన్ ఎక్కడానికి  ప్రయత్నంచిది నాకు చాల బాధ అనిపించింది. నా  కంటీనిండా కన్నీరు….

అది ఏ జన్మబంధం జీవులలో వుండే బాబా ని గుర్తుకు చేసుకున్న ,అలాగే పెద్దలు అంటారు మనిషికి మరుజన్మ ఉంటుంది అది కుక్క జన్మకావచ్చు .అందుకే నాకు అర్ధంతరంగా  ఈలోకము వదలివెళ్ళిన నా స్నేహితురాలు మా అక్కకొడుకు అత్తయ్యకొడుకు తాతయ్య ఇంకా అందరూ నాకు గుర్తుకు రాసాగారు .

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!