వింతమనుషులు

వింతమనుషులు

రచన: దోసపాటి వెంకటరామచంద్రరావు

రామారావు రాధలు ఆ  కోలనీలోకి కొత్తగా అద్దెకి దిగారు. ఇద్దరూ ప్రభుత్వపాఠశాలలో టీచర్లుగా పనిచేస్తున్నారు.కరోనా వలన పాఠశాలలో మూసుకుపోవడంతో ముందున్న ఇళ్ళు విడిచి వాళ్ళ ఊర్లకు వెళ్ళి పోయారు.మళ్ళీ పాఠశాలలో తెరవడంతో తిరిగి ఇంకో ఇళ్ళు చూసుకోవలసి వచ్చింది.ముందున్న ఇంటివాళ్ళు  మరి అద్దెకు ఇవ్వననడంతో మరోచోటుకు రాకతప్పలేదు. వచ్చి రెండు మూడురోజులవడంతో ఆ కోలనిలో వున్న వాళ్ళ గురించి తెలియసాగింది.
వాళ్ళ ఇంటి ఎదురుగా ఉన్నవాళైతే తల్లి కొడుకు కోడలు ఉంటారు.తండ్రి చనిపోయి ఆరునెలైంది.అతనొక ప్రభుత్వ ఉద్యోగి.రావల్సిన డబ్బులు రాలేదని అవొస్తే సొంతవూరికి వెళ్ళిపోతామని అంటుంటారు. ఆ కొడుకు చదువుకోలేదు.ఏ పనిచేయడు.రాత్రనక పెగలనక తాగి తల్లిని భార్యని బండభూతులు తిడుతూంటాడు.
మత్తు దిగిపోగానే మళ్ళీ తాగడానికి డబ్బులుకోసం వాళ్ళిద్దరిని నానా హింసలు పెడుతుంటారు.అంతా గోల గోలగా వుంటున్నా మిగతా ఎవరూ పట్టించుకోరు.
కొత్తగా వచ్చిన రామారావు రాధలు కలగజేసుకొని నచ్చచెప్పడానికి చూసారు.మత్తులో లేనప్పుడు రాముడు మంచిబాలుడన్నట్టు అలాగేనంటూ తలూపుతాడు.మత్తులో ఉన్నపప్పుడు వీళ్ళని తిట్టడం చేస్తుంటాడు.ఇదేం మనిషిరా బాబు అనుకొని ఊరుకున్నారు.
పక్కింటి వాళ్ళతో మాటలు కలుపుదామంటే వాళ్ళు వయసులొ చిన్నవాళ్ళు.అతనొక చోటా రాజకీయనాయకుడు.ఎదో ప్రజాసేవచేస్తున్నట్టుగా ప్రవర్తిస్తుంటాడు. ఇద్దరికి గొప్ప అహంకారం ఎక్కువే.మాట్లాడితే తప్పు మాట్లాడకపోయినా తప్పే అన్నట్టుగా ప్రవర్తిస్తుంటారు. మరికొందరు చిన్న చిన్న ఉద్యోగస్తులే గాని వాళ్ళ హోదాలు దర్జాలు చూస్తే ఏ గెజిటెడ్ ఉద్యోగులెమోనని అనుకుంటారు.
అనవసరంగా ఈ కోలనిలోకి వచ్చామేనని వాళ్ళు విచారిస్తుంటారు. వేరే ఇంకొచోటికి మారిపోవడానికి ప్రయత్నాలు చేయసాగేరు.
ఒకరోజు జరిగిన సంఘటన వారిని అక్కడనుండి వెళ్ళపోవడానికి గట్టిగా నిర్ణయించుకున్నారు.
ఎడమ ఇంటివైపు ఇంటిలో ఇద్దరు ముసిలిదంపతులు ఉంటారు. వాళ్ళేవో చిన్న వ్యాపారంచేసుకొని బ్రతుకుతుంటారు.వాళ్లతోపాటు ఒక మనవరాలు ,మనవడు ఉంటారు.వాళ్ళింకా చిన్నపిల్లలే.మనవారాలిసంగతేమోగాని ,మనవడు మాత్రం చాలా మొండి ,అల్లరి ఎక్కువే.బడికి వెళ్ళకుండా బయటెక్కొడో తిరిగి తిరిగి ఇంటికి వస్తాడు.రామారావు రాధలు పనిచేస్తున్న పాఠశాలలోనే చదువుతుంటాడు.వాళ్ళు ఏరోజుకారోజు వాళ్ళకి రావడంలేదని చెబుతుంటారు.
ఆరోజు పాఠశాలకి వెళ్ళిపోయారు రామారావు రాధలు.సాయంత్రం ఇంటికి వచ్చేసరికి ఇంట్లో వస్తువుల్ని చిందరవందరగా పడివున్నాయి.వెనుక వైపు తలుపు గడి కోసివుంది. ఇదేవరో దొంగపని అనుకొసాగేరు. కుడివొపున ఉన్నవాళ్ళనడిగితే అది ఆ చిన్నపిల్లడి పనేనని ఇలా అందరిల్లలో చేసేవాడని చెప్పారు. పోలిసులకు చెప్పిన వాడు ఏమి మారలేదని చెప్పడంతో వాళ్ళిక చేసేదేమిలేక అక్కడనుండి ఇళ్ళు ఖాళిచేసేసివెళ్ళిపోయారు రామారావు రాధలు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!