(అంశం:”సంధ్య వేళలో”)
నిరీక్షణ
రచన: చైతన్య దేశాయి
నీ ధ్యాస లోనె సదా
నీ కోసమై పరితపించే నా యెద
నువు కనిపించక పోతే
నా జీవితమే వృధా
శరత్చంద్ర వెన్నెలలా ప్రసరిస్తూ
ధరిత్రoత… వెల్లువలా ప్రవహిస్తూ
మంత్రముగ్ధ ధోరణితో
మనసుతోటి… లాలనతో
నువు నాన్నవహిస్తే
నన్ను వరిస్తే..
శతకోటి పుంజముల కాంతినౌతాను
బతుకంత బంధమై అల్లుకుంటాను
తనువంత ప్రాణమై పరవశిస్తాను
వెనువెంట చేరువై నినువరిస్తాను
ప్రియా … ఈ సంధ్య వేళలో
వీచే పిల్ల గాలిలో
నీ కోసం నిరీక్షిస్తుంటా