సంధ్యారాగం

(అంశం:”సంధ్య వేళలో”)

సంధ్యారాగం

రచన: యువశ్రీ బీర

తొలిసంధ్య వేళలో…

గలగల గాజుల సవ్వడివేసే…
ముత్యాల ముగ్గులు పలికేను..
లేలేత రవికిరణాలకు స్వాగతం…
ఆ కిరణ స్పర్శకు, విచ్చుకునే పూరేకులు…
వెదజల్లును సుగంధ పరిమళం…
బుజ్జాయి బోసి నవ్వుల అందం…
వేకువజాము బాణునిచందం…
పెద్దలంతా పనుల్లో,పిన్నలంతా బడుల్లో….
ఆటపాటల అందచందాలు…
తొలిసంధ్య వేళ సోయగం….

సాయంసంధ్యలో అలసిన మనుషులు…
చల్లగాలికి విరబూయును ఆ మోములు…
జాజుల ఘుమగుమలతో పైరగాలి ప్రయాణం…
మోజుల దారులలో కురిపించును ప్రణయం…
జాబిలి పాటలతో పొద్దుగుంకును జీవితం…

****

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!