భార్యా భర్తల బంధం
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
ఎవరికెవరు
ఎందుకిలా కలిశాం
ఎందుకు ఒకటయ్యాం
ఎందుకు ఒకరివెంట ఒకరు
నువ్వెవరు నేనెవరు
నేను నువ్వు కాదా
నువ్వు నేను కాదా
నువ్వు నేను ఒకటి కాదా
నాలో నువ్వు
నీలో నేను
నేనే నువ్వు
నువ్వే నేను
నా నవ్వులో నువ్వు
నీ నవ్వులో నేను
నీ నా నవ్వులో మనం
మనలో మన నవ్వు
ఒకరికొకరు
ఒకరిలో ఒకరు
మన ఇరువురు
మనసైన ఒక్కరు
ఏమిటి ఈ బంధం
ఏమిటి ఈ సంబంధం
ఏమిటి ఈ అనుబంధం
అదే కదా దేవుడు కలిపిన బంధం
అదే కదా భార్యా భర్తల బంధం