(అంశం:” ప్రమాదం”)
ప్రమాద ఘంటికలు
రచన:: శిరీష వూటూరి
ప్లాస్టిక్ వ్యర్థాలతో
నిండిపోయి భూమి
ప్రమాదం అంచున ఉంది
ఓజోన్ పొరకు చిల్లు పడి
ఆకాశం అల్లాడుతోంది
కాలుష్యపు కోరల్లో చిక్కి పీల్చుకునే గాలి విషతుల్యమైనది
అగ్ని కి మండుతూ
అడవులు కనుమరుగవుతున్నాయి
కబ్జా దారుల హస్తాల్లో
నీటి వనరులు మాయమవు
తున్నాయి
పంచభూతాలు ప్రమాద
ఘంటికలు మోగిస్తున్నా
మనం మారకపోతే మన
మనుగడే ప్రశ్నార్థకంగా
మారుతుంది ఒకనాడు….