జీవితానికి ప్రమాదాలు

(అంశం:” ప్రమాదం”)

జీవితానికి ప్రమాదాలు

రచన:: నాగరమేష్ మట్టపర్తి

కష్టసుఖాలు పంచుకొనేందుకు…
స్నేహితులు లేని జీవితం ప్రమాదం…..

ఒకరినొకరు అర్థం చేసుకోలేని…
సంసార జీవితం ప్రమాదం…..

సమస్యలు చుట్టుముట్టిన వేళ…
ఒంటరితనం ప్రమాదం….

సంతానంపై తల్లిదండ్రులు చూపే….
అతి గారాబం ప్రమాదం…..

విద్యార్థులకు చదువులో ప్రేమాకర్షణలు…
వారి బంగారు భవిష్యత్తు ప్రమాదం…..

మిడిమిడి జ్ఞానంతో చేసే…
ప్రతీ ప్రయోగం ప్రమాదం…..

అదుపు చేయలేని…
అతివేగం చాలా ప్రమాదం…..

స్థాయిని మించిన ఆశలు…
సుఖ జీవన గమనానికి ప్రమాదం…..

జీవిత స్థితి, గతులను అస్తవ్యస్తం చేసే
అతి ఎప్పుడూ ప్రమాదకరమే…..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!