ప్రేమ మాయ
రచన: ధనాశి ఉషారాణి
మనసులోగిలో గిలిగింతలు పెట్టి
ముద్దుగా మనసును ముస్తాబు చేసి
రంగుల ప్రపంచములో మనిషిని విహరింపచేసి
సీతాకోకచిలుక వలెను ముద్దుగా ముస్తాబు చేసెను
బంధాలను చిన్నవిగా చేసెను
బాధ్యతలను విడిచి ప్రేమకు బందీని చేసెను
కాలము ఒడిలో ఊసులును చిగురింపచేసేను
గుండెల్లో కన్నీటి ఉప్పెనలో నిలిపేను
ఆకాశమంత ఆశతో ఆనందములో నిలిపి
స్వార్థము మరిచి సర్వస్వము నిండేను
ఊపిరి పోయినట్టుగా క్షణము యుగముగా తలిచేను
దూరము కాలేను అంటూ నిట్టూర్పుతో
నిండుగా మదిని తడిపేను
నిరీక్షణతో బతుకును నిలిపేను