జీవిత గమనం

జీవిత గమనం

రచన: చింతా రాంబాబు

స్వేచ్ఛగా విహరించే బాల్యం
చరవాణి  ఊబిలో పడి
తన చుట్టూ ఉన్న ప్రపంచాన్నేమరచి
అదే తన లోకమంటూ….
శారీరక ఆటలకు దూరమై..
మానసిక రుగ్మతలకు చేరువై
టెక్నాలజీ అనే పంజరంలో బందీగా మారి
చెవులకు మ్యాజిక్ చేసే
మ్యూజిక్ పరికరాలను
చుట్టుకొని…
తనకు తానుగా ఊగిపోతూ
నిద్రాహారాలు మాని
మరో కొత్త లోకం లో
జీవించటానికి అలవాటై
మోడివారిపోతున్న
బాల్యాన్ని చూసి
భయమేస్తోంది.
వారి జీవిత గమనం ఎటువైపు
పోవునోనని….!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!