(అంశం:” ప్రమాదం”)
జీవితమే ప్రమాదం
రచన::దోసపాటి వెంకటరామచంద్రరావు
పుట్టుక ఒక ప్రమాదం
బాలారిష్టాలప్రమాదాలను దాటుకోవాలి
పెరుగుతున్నకొలది ప్రమాదాలే
చదువుకోకపోవడం ప్రమాదం
చదువుకున్నా ప్రమాదం
ఉద్యోగం ఒక ప్రమాదం
పెళ్ళొక ప్రమాదం
పిల్లలుప్రమాదం
పిల్లలపెంపకం ఒక ప్రమాదం
మళ్ళీ పిల్లలచదువుల ప్రమాదం
వాళ్ళ ఉద్యోగాలు ప్రమాదం
వాళ్ళంతటవాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుంటే ప్రమాదం
వాళ్ళపిల్లలపెంపకం కూడా ప్రమాదం
రోడ్డుమీదప్రయాణం ఒక ప్రమాదం
ఇంటిలో ఉన్నా ప్రమాదం
ఒంటరిగా బ్రతకాలంటే ప్రమాదం
నలుగురితో కలసితిరిగినా ప్రమాదం
తిరగకపోయినా ప్రమాదం
ఇలా ప్రమాదాలవిషవలయంలో చిక్కుకోవడం ప్రమాదం
అసలు జీవితమే ఒక పెద్దప్రమాదం.