ఆపన్నహస్తం

(అంశం:” ప్రమాదం”)

ఆపన్నహస్తం

రచన:: ఐశ్వర్య రెడ్డి గంట

జీవన సమరంలో ప్రతిరోజూ ఎదురవుతూ భయపెట్టె ప్రమాదం/
వెన్నుపోటు పొడిచే స్నేహంతో ప్రమాదం/
ప్రేమ అంటూ నమ్మబలికే మోసపూరిత మాటల మనుషుల తో ప్రమాదం//
వాహనాదారులకు రోడ్లపైన దాక్కుంది ప్రమాదం//
బతుకు తెరువు లేక తల్లడీల్లేవేళ ఆకలితో ప్రమాదం//
ఆడపిల్లల మానప్రాణాలకు ప్రతి చోట పొంచి ఉండే ప్రమాదం//
గాలిలో నిండి ఉన్న కాలుష్యరక్కసితో ప్రమాదం/
కరెంటు తో ప్రమాదం, నీటితో ప్రమాదం/
భూకంపాల తో ప్రమాదం /
ఏదైనా మీతి మీరీతే అనర్థదాయకం అవుతుంది ప్రమాదం/
నాకు వస్తేనే ప్రమాదం ఘోరం దారుణం/
పక్కవాడికి వస్తే నాకు లేదు ఏ చలనం
అలా ఆలోచిస్తే నీకు ఏదోరకంగా వస్తుంది ప్రమాదం//
ఎక్కడ ప్రమాదం జరిగిన వెనకడుగు వేయక అందించు ఆపన్నహస్తం /
అదే తిరిగిఅవుతుంది నీకు పది చేతులు సాయం //
ఎన్ని ప్రమాదాలు ఎదురైనా మనిషికి మనిషే తోడు /
అది మరిచిపోక అన్నింటా భాద్యత తో మెదిలి
నివారించు కొంత మేరకు ప్రమాదం//

You May Also Like

One thought on “ఆపన్నహస్తం

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!