రాజా గారి జీవితం

రాజా గారి జీవితం

రచన::స్రవంతి

ఏరా … వాడెక్కడ ఉన్నాడు అంటూ పార్వతమ్మ తన చిన్నకొడుకు కొసం వెతుకుతుంది.
చిన్న కొడుకు పేరు రాజ. ఆ పేరుకు తగ్గట్టు ఆకారం ,రూపం ,ఊరంతా రాజా అని బలాదుర్లు తిరుగుతాడు.కష్టపడి పదవతరగతి పూర్తి చేసి అన్ని పనులు నేర్చుకుంటూ మద్యం తాగడం కూడా నేర్చుకున్నాడు.
పార్వతమ్మ ఇక వీడు మారాలంటే ఒక పనిలో నిలకడగా ఉంచాలి అని తన తమ్ముడు చంద్రయ్య ను ఏదో ఒక పని చూడమని ప్రాధేయపడింది.
అప్పుడే మన రాజా గారి అదృష్టం కొద్ది
ఆ. టీ. సీ లో డ్రైవర్ కొలువుల జాతర ప్రారంభమైంది.
ఈ రాజా గారికి రాని విద్య లేదు. అలా డ్రైవర్ ఉద్యోగంలో మేనమామ దయవల్ల చేరాడు.
అలా ఉద్యోగం చేసుకుంటూ ఉన్నాడు జీతం తీసుకొనే రోజు రానే వచ్చింది. అలా జీతం తీసుకొని మద్యం షాపుకు వెళ్ళడం.
అలా రోజులు… సంవత్సరాలు గడిచిపోయాయి.
పార్వతమ్మ చంద్రయతో కొడుకు రాజా కు పెళ్లి చేస్తే బాగుంటుంది. బంధాలు, బాధ్యతలు తెలుస్తాయి మారతాడు అని అంటుంది.
రాజ గారికి రాణి గారితో వివాహం జరుగుతుంది. పార్వతమ్మ కష్టాలూ తీరక ఎక్కువయ్యాయి..
అదెలా అంటారా….” జోగి జోగి రాసుకుంటే బూడిద రాలింది అన్నట్లు” రాణి గారికి ఏ పని రాదు, ఉలకదు పలకదు మొగుడిని పట్టించుకోదు.

ఇలా ఉండగా ఒకరోజు కొడుకు అదేనండి మన రాజా డిపో లో ఉన్న బస్ తీసుకోని ఊరంత జాలిగా తిరిగాడు ఇంకేముంది ఆఫీసర్లు ఉద్యోగం నుండి తొలగిస్తాం అని చెప్పగా .. పార్వతమ్మ తన తమ్ముడికి చెప్పడంతో ఆఫీసర్లతో మాట్లాడి సర్ది చెప్తాడు.
మన రాజా గారి చేష్టలు ఒకటి కాదు ఎన్నో.పాపం పార్వతమ్మ కు చంద్రయ్య కు మాత్రం తిప్పలు తప్పటం లేదు.
ఇలా తప్పులు చేయడం ఉద్యోగం లో సస్పెండ్ అవడం మామూలు అయింది రాజా కు.

ఒక రోజు రాత్రి చేపలతో నిండిన లారీ నీ
తీసుకువచ్చి ఊర్లో అందరికి పంచి పెట్టాడు. కానీ అమ్ముకొని డబ్బులు సంపాదించాలని చూసేవాడు కాదు మన రాజా గారు. వీడు పిచ్చొడా..బుద్దిలేనోడా..అర్ధం కాదు పార్వతమ్మ కు.
అలా..జీవితం సాగిస్తున్నాడు మన రాజా గారు..

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!