మహారాణి
రచన: మక్కువ. అరుణకుమారి
నట్టింట విరిసిన పూలు
పసిపాపల ముద్దు మురిపాలు
ఇంటింట బంగరు చేలు
ప్రతిఇంట కూర్చును మేలు
పుట్టినింట సీతమ్మ సుగుణాల తేరు
మెట్టినింట రామయ్యకు ఘనమైన పేరు
అత్తిల్లు పుట్టిల్లు కాదు వేరు వేరు
మమతానుబంధాల చిక్కటి తేనీరు
కష్టసుఖాలలో బాధలన్నీ బాపు
కలిమి, లేములందున కనురెప్ప కాపు
కంటికి కనిపించని ఆ దేవుని రూపు
ఇంటికి దీపం ఇల్లాలు చూపు
ఆ ఇంటి యువరాణి నాడు
ఈ ఇంటి మహారాణి నేడు
ప్రేమాప్యాయతల అమృతపు కూడు
తను పంచకుంటే లోకమంతా
శోకాల గోడు
***