నువ్వొక గురుతుల శబ్దానివి

అంశం: జ్ఞాపకాల నిశ్శబ్దంలో

నువ్వొక గురుతుల శబ్దానివి
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన: దాకరపు బాబూరావు

నిశ్శబ్దపు రేవులో
నిరంతరం నువ్వు ఆలోచన్లఅలలా కదులుతూనే ఉంటావు..
ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూసుకుంటే వేసిన అడుగుల్లో
నువ్వే ఓ అస్పష్ట రూపమై అగుపిస్తూఉంటావు.
జాబిలిలా ఎక్కడో
అందనంత దూరంలోవుంటావ్.
అయినా
కలత ఉయ్యాలలోజోగుతున్న నా నిదుర పొద్దుకు
కలల జోల పాడటం నీకే చేతనౌను.
అవునూ…!
నీకోసం ఎన్ని ఉదయాల్నిపరిచయ వాక్యాలుగా పునర్లిఖించుకోవాలి..?
రేయింబవళ్లు నిట్టూర్పుల ఋతువుల్ని దాటుకుంటూ
మన ఇద్దరి ఎడబాటు పడవల్ని రేవు దాటించేస్తుంటే..
కాలం ఒక మౌన సాక్షి కదూ…?
రేపు మాపుల్లో
నిరీక్షణా తోరణాలకు నీ జ్ఞాపకాలపూలనే దండగా గుచ్చుతూ వ్రేలాడదీస్తున్నా..
ఒక్కనీ పిలుపు చాలు ఈ నిశ్శబ్దాన్ని ఛేదించటానికి..!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!