బంధీగ మారిన బంధాలు 

(అంశం:”రక్షిస్తుందా ఈ బంధం”) 

బంధీగ మారిన బంధాలు 

రచన ::చిరునవ్వు Rj రాల్స్

రక్షించేనా నీ బంధం
నిను రక్షించేనా ఓ బంధం
సర్వం సంపాదనగ పోరు సాగిస్థివో
సదా స్మార్ట్ ఫోనుకు సలాం కోడితివో
కలిసిచ్చే కాలంలో గదిగోడలకి పరిమితమైతివో
ముష్టి మున్నాళ్ళ ముసుగులో ముడులన్నీ ముంచేసుకుంటివో
శుభ అశుభలు
అచ్చట్లు ముచ్చట్లు
పండగ పలకరింపులు
బంధ బాంధవ్యలు
ఇరుగు పొరుగు
సంగతి సానిహిత్యాలన్ని
ఎప్పుడెప్పుడని కలగంధువో
ఆ కలలోనే తృప్తిపడుదువో
ఎన్నో ఇంకెన్నో ఎరుగస్తున్న కాలానికి
మేను పుండయి మెలుకున్న నీవు పండయి
కానరాని లోకానికి నీ కలల మూటను తీసుకుపోదువా..
బంధీగా మారిన నీ బంధాలని ఎగిరేద్దువా..
స్వార్ధ స్వలాభాలు నీ జీవితాన్ని సార్ధకం చేయగలవో లేదో
రక్షించేనా నీ బంధం
నిను రక్షించేనా ఓ బంధం

***

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!