పలకరింపు

పలకరింపు

రచన::వడలి లక్ష్మీనాథ్

.ప్రేమించక పోయినా
పర్వాలేదు, ద్వేషించకు.
ఆదరించక పోయినా
పర్వాలేదు, అసహ్యించుకోకు.
పలకరించకపోయినా,
పర్వాలేదు, దుర్భాషలాడొద్దు.

నీ పుట్టుక లేనప్పుడు
బ్రతికిన వాళ్ళు,
నీ పోషణ లేక పోయినా
బ్రతకగలరు.

నీలోని ప్రతి కణంలో
నిక్షిప్త మై నీతోనే పయనమయ్యే
నీ ఆనంద హేతువు వారిదే.
అవివేకంతో నీ జన్మ కారకులను
తూలనాడి , నీ జన్మకే
కళంకం తేవద్దు.

మాతృదినం,
పితృదినం
కాదు వారు కోరుకొనేది.
నోరార పలకరింపు,
ప్రేమతో కూడిన చేతి స్పర్శ.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!