జీవితంపై పచ్చని సంతకం

జీవితంపై పచ్చని సంతకం

రచన::రసస్రవంతి &కావ్యసుధ
(ఎన్. బాలరాజు/ఆర్. హరి శంకర్ )

మనిషి జన్మించినప్పుడు
కులమతాల స్పృహ ఉండదు
“నేను” అనే అహంకారం ఉండదు
మాటలు వచ్చాక మనిషిలో
‘నేను’ అనేది మొదలవుతుంది
శరీరం అంటి పెట్టుకున్న
అవన్నీ నావి అనుకుంటాడు
అప్పుడు సమాజం నుండి
వేరు పడుతూ ఉంటాడు
“నేను” అనే అహంభావం పెరుగుతుంది.
కళ్ళు నెత్తి కెక్కి తాయి.
స్వార్థం మొదలవుతుంది
” నేను ‘అనే మాయలో చిక్కుబడి పోతాడు .
జీవిత చరమాంకం దాకా
నేను ఆత్మభావన లోనికి
మా రాకపోవడమే మాయ
నేను జయించాలి అంటే
సంపూర్ణ శరణాగతి చెయ్యాలి
లేకపోతే మనిషి జీవితం నిష్ఫలమౌతుంది .
మనిషి “నేను’ భావన లోంచి
ఆత్మ భావన లోకి ప్రవేశించడానికి
“ఓం”కారం ధ్యానం ఉపకరిస్తుంది.
అప్పుడు కళ్లపై కప్పుకున్న కంటిపొరలు తొలగిపోతాయి
మానవ జీవితం మహా ఆనందమయం అవుతుంది…
ఓమనిషి నీ అహంకారాన్నివీడి
ఈ లోకం లోకిరా……….
తెల్లని నీ జీవిత కాగితంపై
పచ్చని సంతకం చేసుకో

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!