మగువ మనసులో మాట

మగువ మనసులో మాట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

వ్యాసకర్త : సావిత్రి రవి దేశాయ్

చదువరులకు నమస్సుమాంజలి…..
మన సమాజంలో కుటుంబ  జీవనం లో సారస్వతంలో స్త్రీ కి అతి ముఖ్యమైన స్థానం ఉంది. తల్లిగా, భార్యగా,  బిడ్డగా, తోబుట్టువుగా, అత్తగా, ప్రేయసిగా, మరెన్నో రూపాలతో జీవించి రకరకాల అనుభూతులకు కారణం కాగలిగింది స్త్రీమూర్తి.
ఒక వైపు “న స్త్రీ స్వాతంత్ర మర్హతి” అన్న సమాజమే మరో వైపు స్త్రీని “ఆదిశక్తిగా,  జగన్మాత” గా పూజించారు. స్త్రీ ఇల్లు దాటితే ఏ మాత్రం రక్షణనివ్వలేని మన సమాజం గృహ జీవనంలో మాత్రం గృహత్వపుపట్టం కట్టి ముసుగు వేసి దాచి పెట్టారు. నాలుగు గోడల మధ్య పట్టమహిషి అని భ్రమ పెట్టారు. ఆమె లేనిదే ఆయన పరిపూర్ణం కాదని చాటుకున్నారు. స్త్రీ ని ఒకవైపు నెత్తి మీద పెట్టుకుని పూజించిన సమాజమే ఆమెను కాలితో రాచి, పాతాళనికి తొక్కేసింది. అందుకే అనేక యుగాలుగా ఈ విరుద్ధ పరిస్థితులపై నలిగిన స్త్రీలు ఈ నవీన కాలం లో మేలుకొని…. “మహానుభావులారా… మమ్మల్ని ఆకాశానికి ఎత్తవద్దు పాతాళంలోకి తొక్కవద్దు”…. మేము మానవులమే..మమ్మల్ని బ్రతకనివ్వు..మా వెన్నముక నిటారుగా పెట్టి నడవనీయండి… అని పోరాటం సాగిస్తుంది.ఇలా ఉన్నారేంటీ కడుపు చించుకుని పుట్టిన పేగుబంధాలు. అనుకునే విధంగా కాకుండా…ఇలా ఉండాలా రేపటి తరాలకి ఆదర్శంగా మూర్తీభవించిన రవి తేజో కిరణాల్లా తీర్చిదిద్దాలి.. కట్టూ బొట్టూ కనుమరుగైపోతున్న ఈ నవ సమాజంలో సాంప్రదాయాలకు నిలువెత్తు రూపాలుగా తీర్చిదిద్దాలి…మగువకు ఆజన్మాంతం తప్పని ఆరాటం..ఈ పేగు బంధాలు..హ్కనడం వరకే కాకుండా కనిపెట్టుకునపెంచే సహన సంస్కారాలు వారికి పెట్టని కోటలుగా తయారుచేయాలి. సమాజంలో అత్యున్నత స్థాయికి ఎదిగేలా వారిని తీర్చిదిద్దాలి…
వంటింటికీ మగని ఆలనాపాలనకే కాకుండా మగువలు మరో మెట్టు పైకెదిగి మహోన్నతంగా మలుపు తిప్పేలా తయారవ్వాలి.పురుషాధిత్యతకు ధీటుగా మహిళ మహోన్నతంగా నిలిచిపోవాలి…
5ట్అటు పుట్టినింటికి ఇటు మెట్టినింటికి మాట రానీయక మచ్చలేని ఆభరణంగా మిగిలిపోవాలి…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!