బుద్ధిహీనులు

(అంశం:చందమామ కథలు)

బుద్ధిహీనులు

రచన: సంజన కృతజ్ఞ

ఒక నాడు ఒక రైతు తన కుమారునితో కలిసి బజారుకు వెళ్ళాడు. అంతా తిరిగిన వాళ్లకు నచ్చిన వస్తువేదీ అక్కడ దొరకలేదు. చిట్టచివరకు వాళ్లు గుర్రాల వద్దకు వెళ్లారు అక్కడ ఒక నల్ల గుర్రం రైతుకు బాగానచ్చింది. కొడుకు కూడా ఒప్పుకొన్న మీదట వాళ్ళు ఆ గుర్రాన్ని కొన్నారు. దానితోబాటుగా కొంత దూరం నడిచే సరికి వాళ్లకి నీరసం వచ్చింది అందుచేత వాళ్ళిద్దరూ గుర్రమెక్కి ఇంటికి పోసాగారు దారిలో వాళ్ళని చూసి కొందరు ఆహా ఎంత చక్కని గుర్రము కానీ పాపం అది ఎందుకో విచారంగా ఉంది పోతుల్లాంటి యిద్దరు మనుషుల్ని అది మోయలేక పోతుంది కాబోలు అన్నారు.
ఆ మాటలు విన్న తండ్రి కొడుకులకు చాలా సిగ్గు నిపించింది కుమారుని గుర్రంపై కూర్చోబెట్టి తాను ప్రక్కన నడుస్తున్నాడు రైతు మధ్యలో వారొక బజారు గుండా పోవలసి వచ్చింది అక్కడి జనం వీళ్ళని చూచి కొడుకు ఎంత దుర్మార్గుడో! ముసలి తండ్రి నడిచి వస్తుంటే తానేమో హాయిగా గుర్రంపై కూర్చున్నాడు ఎంత సిగ్గుచేటు!” అంటున్నారు. వెంటనే కొడుకు క్రిందికి దిగి తండ్రిని గుర్రమెక్కించాడు. ఊరి చివర ఒక చెరువు దగ్గరకు వచ్చే సరికి అక్కడ కొంతమంది ఆడవాళ్ళు కూర్చొని ఉన్నారు వారు వీళ్ళనిచూచి “ముసలి వాడెంత దుర్మార్గుడో! పాపం పసివాడు! కొడుకును ఎండలో నడిపిస్తూ తాను హాయిగా గుర్రంపై స్వారీచేస్తున్నాడు” అని అన్నారు. వారి మాటలకు సిగ్గు పడి తండ్రి కూడా గుర్రం దిగి నడవసాగాడు వాళ్లకు ఈ గుర్రంతో చాలా అవమానం కలిగి ఎట్లాగయినా ఆ గుర్రాన్ని వదిలించుకుంటే బాగుంటుందని నిర్ణయానికి వచ్చారు.

అట్ల ముందుకు పోతుండగా వారు ఒక నదిపై వంతెన దాటవలసి వచ్చింది వంతెన పైకి రాగానే యిద్దరూ కలిసి గుర్రాన్ని నదిలోకి తోసివేశారు .అది పూర్తిగా మునిగిపోయిన తర్వాత “హమ్మయ్య! ఈ గుర్రం పీడ వదిలింది ” అనుకొని యిద్దరు ఆనందంగా యింటికి చేరుకున్నారు. వారికి సొమ్ము నష్టపోయామనే చింతలేదు.

నీతి : చెప్పుడు మాటలు విని చెడిపోకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!