నీవు కాక ఇంకెవరు..?

(అంశం : నా అల్లరి నేస్తం)                                                                నీవు కాక ఇంకెవరు..?

రచన :: లోడె రాములు

చిన్ననాటి నేస్తాలన్ని చెల్లాచెదురైన గాలిపటాలు…
పెంచుకున్న బంధాలన్నీ పంచేసిన దానాలు..
సహోదర ఉద్యోగులంతా విశ్రాంతి జీవులు…
ఇక మిగిలింది నాకు నీవు
నీకు నేను..
నీవు కాక ఇంకెవరు..?
నన్ను అస్తమానం ఆటపట్టించేది..
నీవు కాక ఇంకెవరు..?
నన్ను ప్రశ్నించి..వాదులాడేది..
నీవు కాక ఇంకెవరు..?
నాతో గిల్లికజ్జాలు పెట్టుకునేది..
నా ఆలనా పాలనా చూసేది..
నీవు కాక ఇంకెవరు..?
నన్ను కంటికి రెప్పలా ప్రేమించేది..

కాలం కలిపిన కాపురం మనది
కాలాతీతంగా ఎదగాలని
ఎన్ని కలలు కన్నాం..
గుండెను పిండేసే మాటలనేది నువ్వే..
గుండెకు హత్తుకొని లాలించేది నువ్వే..
ప్రతి రోజూ కలహించుకున్నా..
ఒక్కరోజు ఎవ్వరం నీరసపడినా విలవిల లాడిపోతాం..
నీవు లేకుండా నేనుండ గలనా..
నేను గాక ఇంకెవరు..?
నీవు గాక ఇంకెవరు..?
నా అల్లరి నేస్తం..
ఒకరికొకరం జీవితాంతం మన అల్లరిని మనమే భరిద్దాం…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!