నెలరాజు కోరిక

నెలరాజు కోరిక

రచన: ఆర్కా

నింగి నున్న నెలరాజు…
కొలను నున్న కలువను వలచినాడు…

తొలిచూపులో వలచానన్నాడు..

కలువను తన కౌగిట బంధించ మనసైనదన్నాడు…

కలువ సాంగత్యమున కరిగెదనన్నాడు…

ప్రియమారా ముద్దుల తడిలో తడిపెదనన్నాడు…

ప్రియమైన సఖునిగా చేసుకోమన్నాడు…

చేరుకోలేని చెలి మదిన దిగులాయే…

మనసున కోరిక తెలుప భయమాయే…

నెలరాజు తనని తప్పుగా ఎంచిన తట్టుకోలేనిదయ్యే…

సఖుని చేరలేదు… అతనిని వదలలేదు…

ఊగిసలాడే మనసుని ఊరడించలేదు…

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!