భగత్ సింగ్
రచన: లోడె రాములు
భగత్ అంటే భక్తుడు
దేశ భక్తుడు మన భగత్ సింగ్
మూడేళ్ల మనస్సులో
గడ్డి పరకలనే గర్జించే తుపాకుల పంటగా సేద్యం చేస్తున్నానని నినదించిన చిన్నవాడి
స్వతంత్ర్య లక్ష్యం
విద్యార్థి దశ నుండే
దేశభక్తులతో జట్లు కట్టిన
ఉద్యమ నిర్మాత
విప్లవం వర్ధిల్లాలని
విశ్వామంతా వికసించేలా
వినిపించిన భరత సింహం
స్వాతంత్రోద్యమాన్ని విప్లవ పంథాల్లో పరుగులేత్తించిన రథసారధి
ఇరవై ఏళ్లకే ఎన్నో ఆర్గనైజేషన్లలో
ఉద్యమాలకు ఊపిరి అందించిన వజ్ర సంకల్పుడు..
ఐరోపా ఉద్యమ ప్రభావంతో
అనేక విప్లవాత్మాక సంస్థల రూపశిల్పి..
జైల్లో కూడా అరవది నాలుగు రోజులు నిరాహార దీక్ష చేసి న్యాయాన్ని గెలిపించిన దీక్షా పరుడు
దేశ మాత సంకెళ్లను తెంచడానికి ఉరితాడును ముద్దాడిన భరతమాత ముద్దు బిడ్డ..
ఇంక్విలాబ్.. భగత్ సింగ్..
***