ప్రకృతి సుమం
(తపస్వి మనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: విస్సాప్రగడ పద్మావతి
నిశీధిని పరవశింపచేస్తూ
నాట్యమాడే మిణుగురు మెరుపులు
గులాబీ సొగసులు వెదజల్లే
తేనియ మధురిమ సౌగంధాలు
తుంటరి తుమ్మెదల ఝమ్మని నాదాలు
నింగిలో గుంపుగా ఎగిరే
పక్షుల విన్యాసాలు
మదిని దోచే రంగుల హరివిల్లులు
వేకువనే జాలువారే
మంచు బిందువులు
చిలుకా గోరింకల
పలకరింపులు
పచ్చని చీరను చుట్టినట్లు
వయ్యారంగా ఊయలలూగే
పంటచేలు
చేలకు అద్ధకం పులిమినట్లు
రంగు రంగుల సీతాకోక చిలుకలు
నక్షత్రాలను మైమరిపిస్తూ
కార్తీక మాశాన ఆకాశ దీపాలు
తొలి కిరణంతో గగనానికి
రంగులద్దిన సూరీడు
పుడమిని పులకరింప చేసే
గోదారమ్మ పరవళ్ళు
కిన్నెరసాని అందాలు
నిశీధి నేలే అందాల
రాకుమారుడి రాక కోసం
ఎదురుచూసే కలువలు
ధరణీ పై ఎటు చూసినా సంగీత సారణుల హొయలు
మంకెనపువ్వు మందార పూబాలల సొగసులు
చూడ తరమా!!??
చాలా సుందరంగా చెప్పావు పద్మావతి. Super