సామజవరగమన

సామజవరగమన

రచన -మక్కువ అరుణకుమారి

*సా* మవేద జనితమై
*మ* హత్తర ప్రవాహామై
*జ* తులు ,సంగతులు తో అలరారేది సంగీతం
*వ* సంతాగమన వేళ శుక,పికాదుల కిలకిలా
*ర* వాలు సంగీతం
*గ* తి తప్పని గళ మాధుర్యంతో
*మ* దిమదిని పులకింపజేసే
*న* వ్యరాగ ప్రవాహం సంగీతం
*సా* హితీ సాగర గర్భంలో జనించే
*మ* రకత మణులు రాగ,తాన ,పల్లవులు
*జ* తగా ఎగిసిపడే కెరటాలు శృతిలయలు,వాటి
*వ* ద్దికతో సాగుతూ గలగల పారే
*ర* సరమ్య ఉత్తుంగ తరంగ
*గ* ంగా ప్రవాహం సంగీతం
*మ* ధుర సుధారస పానం సంగీతం
*న* వరసభరితం సంగీతం

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!