బెంగటిల్లిన బడి
రచన- శిరీషా వూటూరి
బెంగటిల్లిన బడి
సంబురపడింది
విరబూసిన పూదోటలా
విచ్చుకొని మురిసింది
పక్షుల కిలకిల రావాలు
మళ్లీ మొదలవుతాయని
తుమ్మెదల వలసలు
జుమ్మందినాదాలు
చామంతి పువ్వుల్లా
వికసించే మొగ్గలు
విజ్ఞాన సముపార్జనకై
మళ్లీ బడిపూదోటలో
పరిమళాలు వెదజల్లడానికి
వచ్చేస్తున్నాయని……