నా కవిత

నా కవిత
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన : ఆకుమళ్ల కృష్ణదాస్

నా అక్షరం..
ముద్దులొలికే ముత్యపు చినుకు
వరుస వరుసలో పరుస వేదిలా మెరుస్తుంది!
నా పదం..
పాతాళగంగ(శ్రీశైలం)లో పచ్చల బండ
స్థిరత్వాన్ని కోల్పోయి మెత్తబడదు
మధుర భావాల బాండాగారం!
నా వాక్యం..
ఒంపుసొంపుల సంపెంగ పువ్వు
నవరసాలతో పరవశింపజేసే పరిమళ భరిణే!
నా పేరా..
తలుపుల తన్మయత్వపు అల్మారా
పదముల మధువులు పెదవుల
జాలువారు నయాగారా!
నా పేజీ..
ఒయ్యారాలను ఒలకబోసే విరజాజి
కవి హృదయ సొగసరి అపరంజి!
నా పుస్తకం..
నా మనోహర మస్తకం నుండి
సడిసేయు బుడుగు అడుగుల
మాధుర్య మానస పుత్రిక!
అందులోని అందాల నా కవిత
మనసును సమీరం లా రంజింప జేసే
మకుటాయ మాన మనోహర మమత!!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!