నా చిన్ని తల్లి

నా చిన్ని తల్లి

రచన: శ్రీదేవి విన్నకోట

చుట్టూ జనమంతా ఎందరున్నా
ఒక్కరు క్షణం తనని వదలకున్నా,
అమ్మమ్మ నాన్నమ్మ తాతయ్యలు బుజ్జగిస్తున్న,
పెదనాన్న పెద్దమ్మలు
చిన్నాన్న చిన్నమ్మ లుఎంత ముద్దు చేస్తున్నా,
మేనత్త మేనమామలు ఎన్ని కబుర్లతో మురిపిస్తున్న,
నాన్న తనని కంటికిరెప్పలా చూసుకుంటున్న,
అన్నా తమ్ముళ్లు అక్కాచెల్లెళ్లు తన చుట్టు చేరిన,
నా చిన్నారి చిట్టితల్లి మెరిసే కళ్ళు
ఎప్పుడూ నా కోసమే వెతుకుతాయి.
నన్ను చూడగానే పువ్వులా విచ్చుకునీ నవ్వే
ఆ తీయని పెదవులు,
ఎందరు ఆటపాటలతో అలరిస్తున్న
తన చూపులు మాత్రం అమ్మ నయిన
నా చుట్టూ మాత్రమే తిరుగుతూ ఉంటాయి,
నా లాలి పాటే తన చెవుల కింపు.
నా చేతి స్పర్శే  తనకి అమృత భాండాగారం.
నా బంగారు తల్లికి నేను  ఉంటే చాలు.
సర్వం మరిచి ఆటపాటల్లో మునిగి తేలి పోతు,
నా ఒడిలోనే ఆదమరచి నిద్రపోతోంది.
అందుకే నాకు నా చిన్నారి తల్లి తనకు నేనే చాలు
అనిపిస్తుంది నా జీవిత చరమాంకం వరకు.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!