నాలోని ప్రేమ
రచన: క్రాంతి కుమార్
నా మనసే బంధి అయేనే
నీ అలుపెరుగని తలపులలో
నా మాటే మూగబోయేనే
నీ స్వచ్ఛమైన మదిలో
నా చూపే ఆగిపోయేనే
నీ మేను సొగసులో
నా ఊపిరే నిలిచిపోయేను
నీ తనువులోని అణువణువులో
నా ప్రేమే బానిస అయేనే
నీ వ్యక్తిత్వ పరిమళానికి
నా ఆత్మే పరవశించి పోయేనే
నీ ప్రేమను పొందినందుకు