పెళ్లంటే నూరేళ్ల పంట

పెళ్లంటే నూరేళ్ల పంట
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య  పత్రిక)

రచన : నాగ రమేష్ మట్టపర్తి

తుంటరినై…! ఒంటరిగా….!!
ఊరంతా… ! నే తెగ తిరుగుతున్న వేళ….!!
సొగసరివై…! గడసరిగా….!!
నన్నేరి కోరి… నా జతవయ్యావే….!!
తొలకరి చినుకులుగా…!
అనురాగపు వలపుల ప్రేమ జల్లులనే
నాపై కురిపించి నన్ను మైమరపించావే….!!
నేను నీకు…! తోడుగా….!!
నీవు నాకు…! నీడగా….!!
ఆప్యాయంగా…! ఆత్మీయంగా….!! అయ్యాముగా…! ఆలుమగలుగా….!!
ఇరు హృదయములూ…!
ఒరవడిగా ముడిపడి….!!
సందడిగా జతపడి…..!!!
ఒకటైన శుభవేళ…..!!!!
మన ఈ నవజీవన జంటకు…!
నూరేళ్ల పంటగా….!!
రెండు అమూల్య రత్నాలే…!
సంతానంగా కలిగే కదా…..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!