తెలివి-గెలివి

తెలివి-గెలివి

రచన :యాంబాకం

గణపతి శెట్టి గొప్ప వ్యాపారస్థుడు. బజారు లో అంగడి పెద్ద పెద్ద భవనాలు అప్పటి లో నే అందరూ ఆ భవనాలను చూసి ఆశ్చర్యంగా!చూస్తూ పోయేవారు. “శెట్టి రాత్రి కొట్టు మూసికొని నేరుగా ఇంటికి రాగానే రోజువారి ఆదాయం ఎంతో తేల్చు కోవటానికని,డబ్బు అంతా కుమ్మరించి నోట్లకు నోట్లు చిల్లరకు,చిల్లర అంతా విడి విడి గా విడదీసి లెక్కపెట్టి గాని నిద్రపోడు,తినడు,అతని కి అలవాటు ప్రతి రాత్రి మామూలే ఇది శెట్టి భార్యకు మాత్రమే తెలుసు.

ఒకరోజు రోజులాగే కొట్టు మూసి ఇంటికి వచ్చి డబ్బు అంతా కుమ్మరించి లెక్కిస్తూ వుండగా ఆ సమయంలో “ఎవరో తలుపు తట్టి పిలిచి నట్టు ఉండగా ఎవరో ఏమిటో అనుకొని డబ్బు మీద టవలు కప్పి”గభీమని తలుపు తీసి ఎవరండీ అంటూ చూడగా! ఆ వచ్చిన వాడు శెట్టి తో చిన్నప్పుడు కలసి చదువు కొన్న బాల్య మిత్రుడు చెంగయ్య శెట్టి దగ్గర గల చనువు తొ అతను అంటే చెంగయ్య నేరుగా డబ్బు పరిచి ఉన్న గది లో నికి వచ్చి కూర్చున్నాడు.

కుశల ప్రశ్నలు చిన్నప్పుటి చిలిపి గుర్తులు చెప్పుకొన్నా! తరువాత చెంగయ్య ఒరే! గణపతి నేను ప్రస్తుతం చిన్న సమస్య లో ఉన్నాను. “ఎలాగైనా ఒక పదివేలు సర్దుబాటు చేసావంటే నీకు నాలుగు రోజుల లోపల తిరిగి ఇచ్చేస్తాను అని చెంగయ్య అప్పు అడిగాడు.

“శెట్టి అలోచనలో పడి ప్రస్తుతం వ్యాపారం అంతగా లాభసాటిగా లేదు డబ్బు లు భలే ఇబ్బంది గా ఉంది. అని పూస గుచ్చి నట్టు మనసుకు హత్తు కొనేట్టు విప్పిచెప్పగా. చెంగయ్య మాత్రం పట్టు పట్టిన విక్రమార్కుని” లా!

అదికాదు “ఎంత వడ్డీ కైనా సరే ఎక్కడ నుంచి ఐనా సరే తెచ్చి ఇవ్వు “అంటూ! బలవంతం చేయగా.ఎమీతోచని శెట్టి కి చెంగయ్య మాట తీసిపారేయ లేక పోయాడు.

ఇద్దరూ ఇలా మాట్లాడు తుండగానే అకస్మాత్తుగా కరెంటు పోయింది. గది అంతా చిమ్మ చీకటి గా అయి పోయింది వెంటనే శెట్టి ఆప్యాయంగా చెంగయ్య చేతులు రెండూ పట్టుకొని.

ఓరే! మరేమీ అనుకోవద్దు సుమా! నీ వంటివాడు ఈ రాత్రి వేళ వస్తే మాటదక్కించు కో లేక పోయాను,కదా అని మనసులో ఎంతో బాధ గా వుంది.అని సానుభూతి తో మాటలు సాగించారు.

పైగా “రాక రాక వచ్చావు . భోజనం చేసి వెళ్ళుదువుగాని”
అంటూ శెట్టి చెంగయ్య రెండు చేతులు పట్టుకుని బతిమాలాడ సాగాడు.

“ఆహా.. వద్దు.. వద్దు వెళ్ళోస్తా అని చెంగయ్య చెప్పగా, శెట్టి ఇంకా బలవంత పెట్టాడు.
అంతలో శెట్టి భార్య దీపాలు వెలిగించింది. ఇంతకీ ఎంటి గొడవ అంది.కాంతి వెలుతురు రాగానే అప్పుడే శెట్టి చెంగయ్య చేతులు వదిలిపెట్టాడు. అప్పటి వరకు పట్టుకొనే ఉన్నాడు.

తరువాత తెలివిగా శెట్టి సరేలే ఈ సారి వచ్చి నప్పుడు తప్పకుండా భోజనం చేసి గాని పోవడానికి లేదు అని,
చమత్కరించి ఊరకున్నాడు.

చెంగయ్య సెలవు తీసుకుని వెళ్లి పోయాడు.”అయినా అతడిని భోజనానికి ఉండమని ఎందుకు అలా బతిమాలు తున్నారు.అంది శెట్టి భార్య అందుకు గణపతి శెట్టి “ఓసి పిచ్చి మొహం వాడిని ఎవడు! ఉడమంటారూ.అది రాత్రి పది గంటలకు అది భోజనానికి!

డబ్బు అంతా పరిచి ఉంటిమి ఎంత ఉందో కూడ తెలవకపోయే,, పైగా లైట్లు ఆరిపోవటం చేత వాడు డబ్బు కాజెసి పోతాడేమోనని అదిగాక,వాడు చాలా కాలం తరువాత కనిపించాడు,వాడి,ఇప్పటి బుద్ది మనకు తెలియదు. ఇంకనూ డబ్బు లు అన్ని అక్కడే పరిచుంటిమి అందుకే లైట్లు వచ్చే దాక వాడి చేతులు పట్టుకుని ఇంత నాటకం ఆడవలసివచ్చిందే. అని సమాధానం చెప్పాడు. శెట్టి.”భర్త తెలివి తేటలకు యుక్తి కి చాలా సంతోసించింది.
శెట్టి భార్య భలే ! మీ తెలివి గెలివి అంటూ నవ్వింది.

You May Also Like

One thought on “తెలివి-గెలివి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!