తప్పు నేర్పిన గుణపాఠం

తప్పు నేర్పిన గుణపాఠం

రచన: సావిత్రి తోట “జాహ్నవి”

లావణ్య ఒక పేదింటి అమ్మాయి. కాని ఆశలు మాత్రం ఆకాశంలో ఉంటాయి. ఎపుడు కలలో తేలుతూ, పేకమేడలు కడుతుంది అవి గాలి వస్తే కూలి పోతాయని తెలియక.

లావణ్య తల్లిదండ్రుల కు ఒకర్తె  కూతురు. తండ్రి  ప్రసాద్  ప్రైవేట్ కంపెనీలో చిన్న గుమాస్తాగా పనిచేస్తున్నాడు. వేరే ఆస్తులు లేవు వారికి. లావణ్య తల్లి కమలకి ఆరోగ్యం సహకరించక ఇంటిపట్టునే ఉంటూ,  ఉన్నంతలో పొదుపుగా వాడుతూ కుటుంబానికి ఏ లోటు రాకుండా చూసుకుంటుంది.

ఒకర్తె కూతురు అవ్వడం వలన ఉన్నంతలో మంచి సంబంధం చూసి పెళ్లి చేయాలని ఆ తల్లిదండ్రుల ఆశ. కాని ఎన్ని సంబంధాలు చూసిన ఏదో వంక పెట్టి తప్పించేస్తూ, లక్షాధికారి తో తన పెళ్లి జరగాలని కలలు కంటుంది  లావణ్య.

ఇంకా ఆ ఇంట్లోనే ఉంటే ఏదో ఒక సంబంధం చూసి పెళ్లి చేసేస్తారని తలచి, కొన్నాళ్లు స్నేహితురాలి దగ్గర ఉండి,ఉద్యోగం చేస్తానని చెప్పి, తన తల్లిదండ్రుల ను ఒప్పించి, ఆ ఇంటి నుంచి బయటపడి ఉద్యోగం వెతుక్కుంటూ, పట్నం చేరింది లావణ్య.

స్నేహితురాలు పద్మ దగ్గర ఉంటూ, ఉద్యోగం కంటే సరదాలు, షికార్లకు కాలం వెచ్చిస్తూ , పేస్బుక్ లో  డబ్బున్న యువకులతో ప్రెండ్షిప్ చేస్తూ, వారితో అందమైన జీవితం ఊహించుకునేది.

 పద్మ ఎన్ని ఉద్యోగాలు చూసిన ఏదో వంకతో చెడగోట్టుకుంటూ, డబ్బు అవసరమైనపుడల్లా ప్రసాద్ కి ఫోన్ చేసి, అప్లికేషన్ లని, చార్జీలు అని, రెంటు అని డబ్బు తెప్పించుకుని, ఇష్టానుసారంగా ఖర్చుపెట్టేది. పాపం ప్రసాద్  లావణ్య ఒకర్తె  కూతురు అవ్వడం వలన  ఏది అడిగిన కాదనలేక, అప్పోసప్పో చేసి లావణ్య కి డబ్బు పంపించే వాడు.

ఒకసారి లావణ్య ని పేస్బుక్ లో ఒక ప్రోపైల్ ఆకర్షించింది. అతని పేరు దినేష్. బాగా కోటీశ్వరుడు. పోటోలో  చాలా రిచ్ గా కనిపిస్తూ, లావణ్య ని ఆకట్టుకున్నాడు.

లావణ్య ఎలాగైనా అతనితో స్నేహం చేసి, పెళ్లి వరకు తీసుకెళ్లాలని తలచి,  అతని ప్రోపైల్ సెర్చ్ చేసి కష్టపడి పోన్ నెంబర్ సంపాదించింది. ఏదో పొరపాటున ఎవరికో ఫోన్ చేయబోయి , చేసినట్లు పోన్  చేసింది దినేష్ కు.

“హాయి, లత ఎలా ఉన్నావ్.? మీ వారు ఏమంటున్నారు. ఇంకా అలాగే ఉన్నారా, లేదా ఏమైనా మార్పు వచ్చిందా? లేదంటే మా అంకుల్ తో చెప్పి జైలులో పెట్టిద్దాం. నీకు తెలుసు కదా. మా అంకుల్ పెద్ద పోలీస్ ఆఫీసర్ అని. “అని గడగడ మాట్లాడుకుంటూ, వెళ్లిపోయింది.

“హాలో, ఆగండాగండి. మీరు ఎవరనుకుని ఫోన్ చేసారో నాకైతే తెలియదు. కాని మీరు చెప్పిన లత అన్న వాళ్లు ఇక్కడ లేరు. నా పేరు దినేష్. “అని  లావణ్య మాటలకు అడ్డుపడ్డాడు.

“ఓ, సారి, అండి. నేను మా ప్రెండ్ లత అనుకుని, మాట్లాడేసాను. నిజంగా సారి” అంటూ పదే పదే సారి చెప్తూ, అతనిలో  తన పట్ల కుతూహలం కలిగించింది.

అలా రోజు లతకి  ఫోన్ చేస్తున్నట్లు నటిస్తూ, రాంగ్ నెంబర్ అని చెప్పి దినేష్ తో మెల్లిగా పరిచయం పెంచుకుంది. అలా రోజూ వాళ్లిద్దరూ గంటల కొద్దీ చాటింగ్ లతో, పోన్ కాల్స్ తో గడుపుతూ, ఒకరి మీద ఒకరూ ప్రేమను కనబరచుకునేవారు. అలా దినేష్ లావణ్య కి దగ్గర అవుతూ, ఎన్నో గిప్ట్స్ లావణ్య అడ్రస్ కి పంపించే వాడు.

ఒకసారి లావణ్య యే దినేష్ తో రోజు గిప్ట్స్ యేనా  ఒకసారి మనిద్దరం ఎక్కడైనా కలుసుకుందాము. నాకు మిమ్మల్ని చూడాలని, మాట్లాడాలని ఎంతో ఆశగా ఉంది అని అడిగేసింది.

దానికి దినేష్ కూడా నాకు కూడా నిన్ను చూడాలని ఉంది. నేను ప్రస్తుతం స్టేట్స్ లో ఉన్నాను. వచ్చాక  మనం తప్పక కలుద్దాం అంటూ ఎప్పటికప్పుడు వాయిదా వేసేవాడు.

అలా రోజు రోజుకి వాళ్లిద్దరూ చాట్ చేస్తూంటే, ఒక రోజు దినేష్ లావణ్యాని ఒక కోరిక కోరాడు. దానికి లావణ్య వెంటనే అంగీకరించలేక పోయింది.

కాని  దినేష్”  నా మీద నీకు నమ్మకం లేదు. నాతో మరి మాట్లాడకు . మరి నిన్ను ఇబ్బంది పెట్టనులే “అంటూ బ్లాక్ మెయిల్ చేయడంతో .

“అదేమి లేదు.నిన్ను నమ్ముతున్నాను.  కాని  ఎంతైనా ఆడపిల్లను కదా పెళ్లికి ముందు ఇలాంటివి అంటే కొంచెం భయం వేస్తుంది. నాకు కొంచెం సమయం కావాలి.”అని నచ్చ చెప్పేది.

అలా వాళ్లిద్దరూ ఎపుడూ ఫోన్లో మాట్లాడుకున్న దినేష్  లావణ్య ని తన కోరిక తెలియపరిచేవాడు. లావణ్య ఇదిగో, అదుగో అంటూనే గడిపేస్తుంది. ఒకనాడు,

“మరి నా మీద నీకు నమ్మకం లేదని అర్దం అయిపోయింది. మరి రేపటి నుంచి నాతో చాటింగ్ చేయకు, మాట్లాడకు. నేను పంపించిన గిప్ట్స్ మాత్రం నీ దగ్గర ఎందుకు వెంటనే పంపించేయ్యి. ” అంటూ చాలా బాధపడుతున్నట్లు మాట్లాడుతూ లావణ్యలో సందిగ్ధ పరిస్థితి కల్పించాడు.

లావణ్యలో ఒకరకమైన అలజడి మెుదలయింది. “ఇపుడు నేను దినేష్ అడిగినట్లు తన కోరిక తీర్చ లేకపోతే, అతను ఇచ్చిన ఖరీదైన గిప్ట్స్ అన్ని తిరిగి ఇచ్చేయాలి. తాను అవ్వన్ని  ఎపుడో వాడేసింది. మళ్లీ కోనాలాంటే చాలా డబ్బు కావాలి. ఇప్పటికే నాన్న చాలా డబ్బు పంపించారు. చివరిగా పంపుతూ ఇక డబ్బు పంపడం తన వలన కాదని. అయితే తొందరగా ఏదో ఒక జాబ్ చేసుకోమని, లేదంటే ఇంటికి తిరిగి వచ్చేయమని గట్టిగా చెప్పారు. ఇక  దినేష్ ని కూడా వదులుకుంటే , తిరిగి ఆ పల్లెటూరికి వెళ్లి, ఎవడో తలకి మాసినవాడితో తలవంచుకుని తాళి కట్టించుకోవాలి. అమ్మో నావలన కాదు. “అని ఆలోచించి, దినేష్ కోరిక తీర్చడానికి అంగీకారం తెలిపింది.

మరునాడు దినేష్ కి ఫోన్ చేసి, “ఈ రోజు సాయంత్రం నీ కోరిక తీరుస్తాను. రెడీగా ఉండు” అని చెప్పింది. దానికి దినేష్ ఈ రోజు మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. అందరూ ఉంటారు . ఈ రోజు వద్దు. రేపు చూద్దాం .ఈ రోజు బిజీగా ఉంటాను కాల్ చేయకు. అని లావణ్య ఏదో అడగబోతున్న పట్టించుకోకుండా ఫోన్ పెట్టేసాడు.

“ఏంటి నేను తన కోరిక తీరుస్తాను అన్న కూడా వద్దని పోన్ పెట్టేసాడు. పోనీలే ఈ రోజుకి గండం గడిచింది. రేపటి సంగతి రేపు చూసుకోవచ్చు.”అనుకుని భారంగా నిటూర్చింది. ఇంతలో పద్మ వచ్చి ,  “ఈ రోజు తన స్నేహితురాలి పుట్టిన రోజు  నీ గురించి చెప్తే ఎలాగైన నిన్ను ఈ రోజు తీసుకురమ్మని చెప్పింది”.అంటూ బలవంతంగా ఫంక్షన్ కి బయలుదేరదీసింది.

లావణ్య కూడా ఈ ఫంక్షన్ వలన బాగా డబ్బుఉన్నవారితో స్నేహం చేయవచ్చని చెప్పి పద్మతో  ఫంక్షన్ కి వెళ్లడానికి తయ్యారయింది.

అలా పద్మ తో ఫంక్షన్ కి వెళ్లిన లావణ్య  , అందరితో నవ్వుతూ, గడుపు తుంది . అలా రేపటి గురించి ఆలోచన మరిచి , ఆట ,పాట లతో ఒకరి మీద ఒకరూ జోక్స్ వేసుకుంటూ సంతోషంగా గడిపింది లావణ్య.

ఇంతలో ఎవరో భోజనాలు తయ్యారయ్యాయి. తిద్దాం రండి అని పిలవడంతో. అందరూ కలిసి మేడ మీద భోజనాలు ఏర్పాట్లు జరుగుతున్న స్దానానికి వచ్చి, అక్కడ డిష్ లు అమరుస్తూన్న దినేష్ ని చూసి అవాక్కయింది.

తరువాత  పద్మని పిలిచి, “నాకు తలనొప్పిగా ఉంది. నేను కింద ఉంటాను, నువ్వు తొందరగా తినేసి రా. “అని చెప్పి, కిందకి వెళ్లిపోయింది.

తరువాత పద్మ తో కలిసి ఇంటికి వచ్చిన లావణ్య  “ఎంతలో  పెద్ద గండం గడిచింది. ఇంక నయం దినేష్ అడిగినట్లు నా న్యూడ్ పోటో పంపలేదు.  పంపిన తరువాత నా పరిస్థితి ఏమయ్యేదో. ఇక్కడే ఉంటూ ఏదో వంటలు వండుకునే వాడు.  ఫారెన్ లో ఉంటున్నట్లు ఎంత బిల్డాప్ ఇచ్చాడు. నేను నిజంగా పోటోలు పంపితే, నా బతుకు బస్టాండ్ అయ్యేది. అమ్మ, నాన్న, తమ్ముడు ఏలా తలేత్తుకుని తిరిగలిగేవారు. అందరికి ఆత్మహత్యే  శరణ్యం అయ్యేది. కొంచెంలో పెద్ద గండం నుంచి తప్పించాడు  ఆ భగవంతుడు. నేను వెంటనే ఈ పట్నం వదిలి మా పల్లెకు వెళ్లిపోవాలని” తలచి ఆ రాత్రి కలత నిద్ర తో గడిపింది.

తెల్లవారుజామున లేగుస్తూనే  , పద్మతో  ఏ సంగతి చెప్పకుండా, “ఇంటికి వెళ్లి పోతాను” అని మాత్రం చెప్పి, పద్మ “ఉండమని ఎంత అంటున్న వినకుండా వెంటనే బస్సులో ఊరు వచ్చేసింది.

 తరువాత ప్రసాద్ చూసిన తమ ఊరు అబ్బాయి తో బుద్దిగా తలవంచుకుని  తాళి కట్టించుకొని,   అందరి మెప్పు పొందేలా తన భర్తని ప్రేమిస్తూ,చక్కగా కాపురం  చేసుకుంది.

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!