ఎక్కడైనా కోయిలే!
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: ఎం.వి.చంద్రశేఖరరావు
అదిగో, తీపిరాగాల కోయిల,
మృధుమధురంగా ,
రాగాలనాలపిస్తోంది!
కోయిల ఎక్కడైనా కోయిలే!
కీకారణ్యంలోవున్నా,
రాచనగరులోవున్నా,
కాంక్రీటుజనారణ్యంలో
వున్నా, ఎక్కడవున్నా,
కోయిల కోయిలే! మధుర రాగాలు, మధుర రాగాలే!
అరుణారుణ సూర్యోదయమౌతున్నా,
సంధ్యాసమయమవు తున్నా,
ఎర్రనిఎండలుకాస్తున్నా,
కోయిలరాగాలు, మధుర రాగాలే!
వ్యక్తిత్వం మంచిమనుషులను,
మంచిమనుషులు, ఎక్కడ,
ఎలావున్నా, దేశాన్నితీర్చి
దిద్దుతునే ఉంటారు
మానవత్వం పంచుతునే ఉంటారు,
విరటుని కొల్వులో, అఙ్ఞాతవాసం చేసిన పాండవులే ఇందుకు ఉదాహరణ!
దేశాన్నిరక్షించారు,
రాక్షసాన్ని సంహరించారు,
ప్రజల మది, హృది,
కోయిలలా, రంజింపచేశారు!