నిర్వేదన..!

నిర్వేదన..!

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: గాజులనరసింహ

కవికి లేదు మరణము
తనకవిత తనకు  ప్రాణము
ఈ సువిశాల జగత్తుకు
తానో వెలుగు కిరణము

కననివేవి కావు
ఎరుగనివేవి కావు
హద్దుల ఉండిన పొద్దుల
భాధలేవి రావు

అదుపు తప్పిన నాగరితి
బుద్ధిమాలిన పరపతి
ఏలుతుంది రాజ్యం
అధోగతి అవుతుంది దేశం

తీరు తెన్నులు మారాలి
నాగరికంగా నడవాలి
నడత నలుగురు మెచ్చాలి
అందరి బతుకు కోరాలి

రాదు రాదు ఇంకా స్వాతంత్రం
పోలేదు పోలేదు ఇంకా  పీడత్వం
కొట్టుకుపోతుంది దేశ సౌభాగ్యం
చూస్తున్నారు అంతా  సోద్యం..

పున్నమి నరకాలు
భరించేను తరతరాలు
శిక్షలెన్ని వేసినా..
మారునేమి ఈ మానవ మృగాలు

విలువలు తప్పిన  వివరము
విచారించనేమి ఫలము
జరుగునదిగో.చూడరా..
దిన దినముకొక్క ఘోరము..

వివరములు ఎరిగినవారు
జిజ్ఞాసలు కలిగినవారు
మొహాలపడి చెదురే..
తుచ్ఛపు పనులెన్నో..

గట్లు గట్లు పంచుకున్న
దొరలకు లేవు శిక్షలు
బికారుల కెందుకు
అంతుపట్టని శిక్షలు

ధర్మం తప్పిన నడతలివి
దారి తప్పిన బతుకులివి
బజారున బేరాలతో సాగుతుంది లోకం
సంప్రదాయాన్ని సమాధి చేసి ..

నిలువదు నిలువదు ఇక ఇది లోకం
తగక తప్పదింక  శూన్యం
సూర్యచంద్రులే దీనికి సాక్షాత్కారం
తలవంచక తప్పదింక కర్మానుసారం.

 

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!