ఔను సహజత్వం చచ్చిపోయింది.!

ఔను సహజత్వం చచ్చిపోయింది.!

(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)

రచన: పిల్లి.హజరత్తయ్య

రెండు రెళ్ళు ఎంతంటే
క్యాలిక్యులేటర్ నొక్కి మరీ
సమాధాన మిచ్చినపుడే
సహజత్వం చచ్చిపోయింది..!

చేతివంటను పక్కనెట్టి
బయట వంటకు ప్రాధాన్యమిచ్చి
రోగాలు కొనితెచ్చుకున్నప్పుడే
సహజత్వం చచ్చిపోయింది..!

ఫోన్లు, ప్లాస్టిక్ కార్డులే
జీవితంలో భాగమై
జీవనశైలి మారినపుడే
సహజత్వం చచ్చిపోయింది..!

ఉదయం లేచింది మొదలు
రాత్రి పడుకునే దాకా
యంత్రపరికరాలపై ఆధారపడినపుడే
సహజత్వం చచ్చిపోయింది..!

సాంకేతిక విజ్ఞానం కోసం
పిల్లలు అర్రులు చాస్తూ
నేల విడిచి సాము చేసినపుడే
సహజత్వం చచ్చిపోయింది..!

డిజిటల్ మాయలోపడి
గొర్రెలా తోకాడిస్తూ
బురిడీ కొట్టించుకున్నప్పుడే
సహజత్వం చచ్చిపోయింది..!

ఎంతటి స్మార్ట్ యుగమైనా
సైబరాసుల పోటుకు
బలికాకుండా ఉండాలంటే
శ్రుతి మించని జాగురూకతతో
అపశ్రుతిని జయించి
సహజత్వాన్ని బతికించాల్సిందే..!

You May Also Like

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

error: Content is protected !!