ఒక్క ఓటమి
(తపస్విమనోహరం అంతర్జాల తెలుగు సాహిత్య పత్రిక)
రచన: పసుమర్తి నాగేశ్వరరావు
ఒక్క ఓటమి
మనిషిని మార్చేస్తుంది
తలరాతను తిరగ రాస్తుంది
జీవితం లో పెనుమార్పులు చేస్తుంది
ఓటమి ఒక్కొక్కరినీ ఒక్కొక్కలా మారుస్తుంది
పిరికివాడిని అక్కడితో ఆగిపోయినట్లు చేస్తుంది
సాహసావంతున్ని ఆలోచింప చేస్తుంది
ధైర్యవంతునిచే ముందడుగు వేయిస్తుంది
ఓటమి గెలుపుకు తొలిమెట్టు ఆశావాది కి
ఓటమి కొత్త ఆలోచనకు పునాది కార్యసాధకునకు
ఓటమి నవశకానికి నాంది కర్తవ్యమెరిగిన వారికి
ఓటమి ఓర్పునిస్తుంది సహనశీలులకు
అందుకే ఓటమిని ఓడించు
ఓటమి నిను ఓడించక ముందు
ఓటమిని అధిగమించు
ఓటమి నిను దాటకముందు
కాకూడదు ఓటమి మన అంతిమం
కాకుడదు ఓటమి మన వైఫల్యం
కాకూడదు ఓటమి మన బలహీనత
ఓటమిని ఓడించు వాడే నిజమైన విజేత