(అంశం :: “విమర్శించుట తగునా”)
ఓర్పు
రచన::వి విజయ శ్రీ దుర్గ
నేస్తమా!! ఓర్పు నీ ఆయుధము కావాలి విమర్శలు నిన్ను ఏమి చేయలేవు
ప్రతి విమర్శని సద్విమర్శగా తీసుకో
మనిషిగా సాటి మనిషిని అపహాస్యం చేయుట చులకనగాచుడటం
విమర్సించుట సర్వ సాధారణం నేటి సమాజంలో
మనిషికి నరం లెని నాలుక ఎన్నో చురకలు వెక్కిరించుట అవమానించుట చేస్తారు
లొకమంతా వెటకారధోరణి తప్పదు దైర్యంగా అడుగెయ్యాలి
విమర్శించారు కదా అని సతికిలపడితే
లాభమెవ్వరికి ??
అంతర్ముఖుడై అంతర్మధనం చేసుకో
నీఅవమానాలు నీలోనే దాచిపెట్టుకో
సంకల్పం ఏకాగ్రతతో పట్టువదలని విక్రమార్కుడువలె నీఆశయం కోసము పోరాడు
నిన్ను వెక్కిరించిన నోళ్లే ఔరా అనిపించుకోవాలి
సానుకూల దృక్పథం సహానం లౌక్యం అలవర్చుకొంటే అంతిమ విజయం తప్పక వరిస్తుంది